YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ నేతలు మైండ్ ట్యూన్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతున్న అయ్యన్న, కేఈ

టీడీపీ నేతలు మైండ్ ట్యూన్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతున్న అయ్యన్న, కేఈ

ఏపీలోనూ, జతీయ స్థాయిలోనూ ఓ స్థాయిలో చర్చ జరుగుతున్న కాంగ్రెస్ టీడీపీ పొత్తుల అంశంపై సీనియర్ నాయకుడు, విశాఖ జిల్లా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దాదాపుగా అంగీకరించారనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఈ రెండు పార్టీల పొత్తులపై జరిగిన ప్రచారాన్ని గట్టిగా ఖండించిన మంత్రి రెండు రోజుల క్రితం చంద్రబాబు ఏకంగా డిల్లీకి వెళ్ళి మరీ రాహుల్ తో కరచాలనం చేసినా మౌనమే నా సమాధానం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుంచి అయ్యన్నపాత్రుడు టీడీపీలోనే కొనసాగుతున్నారు. రెండు సార్లు తప్ప ఇప్పటికి ఆరు తడవలుగా నర్శీపట్నం నుంచి ఎమ్మెల్యేగా, పలు మార్లు మంత్రిగా, ఎంపీగా కూడా పనిచేసిన అయ్యన్న బాబు కంటే కూడా టీడీపీలో సీనియర్. ఆ మాట ఆయనే చాలా సందర్భాలలో చెప్పుకున్నారు. అన్న నందమూరి తనను పిలిచి టికెట్ ఇచ్చారని, పెళ్ళి కాకుండానే పిన్న వయసులో మంత్రిని చేశారని కూడా అయ్యన్న గతం గుర్తు చేసుకుంటారు. తమ రక్తంలో ఉన్నది టీడీపీయేనని, కాంగ్రెస్ వాసన లేనేలేదని కూడా అంటారు. అటువంటి అయ్యన్న ఇపుడు ఏపీలో కాంగ్రెస్ టీడీపీ పొత్తును మౌనంగానే ఒకే అనేస్తున్నారు.అయ్యన్న వాణి ఈ మధ్య మూగబోవడానికి స్థానికంగా ఉన్న పరిస్థితులే కారణమని అంటున్నారు. ఓవైపు కుటుంబంలో కలహాలు ముదిరాయి. కొడుకు, తమ్ముడు ఇద్దరూ వారసత్వం కోసం రచ్చకెక్కారు. అదే సమయంలో ఈ వివాదం అధినేత చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళిపోయింది. ఇంకో వైపు చూసుకుంటే పార్టీకి నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోంది. 2014లో కేవలం రెండు వేల ఓట్లను మాత్రమే తెచ్చుకున్న అయ్యన్నకు ఈసారి వైసీపీ పెను సవాల్ విసురుతోంది. ఈ పరిణామాల నేపధ్యంలో అయ్యన్న డీలా పడ్డారని అంటున్నారు. అంతే కాదు, పార్టీకి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా పార్టీ అంతా తన వెనక నడిచే అవకాశాలు లేవని అంటున్నారు. దాంతో అయ్యన్న మౌన వ్రతం పట్టారని చెబుతున్నారు. కుమారుడు విజయ్ ని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చూడాలని అయ్యన్న అనుకుంటున్నారు. అందుకు గాను తాను రాజకీయంగా తప్పుకోవాలని కూడా చూస్తున్నరు. ఈ టైంలో నోరు జారితే పార్టీ పరంగా ఇబ్బందులతో పాటు, కొడుకు భవిష్యత్తు కూడా ఇబ్బందుల్లో పడుతుందని అయ్యన్న అనుకుంటున్నారట. అందువల్లనే ఆయన పొత్తులపై పెదవి విప్పడంలేదని అంటున్నారు. ఏది ఏమైన అయ్యన్న మునుపటి వాడి వేడి ని ప్రదర్శించలేకపోతున్నారని అంతా భావిస్తున్నారు.

Related Posts