కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలోని వేకనూరు శివారు ప్రాంతంలో ఉన్న లంక గ్రామమైన ఎడ్ల లంక లో 1500 ఎకరాల లో ఉన్న మామిడి తోటలు ఉప్పు నీటి వలన నల్లబడిపోయి, పూత రాక పోవడంతో, గత ఐదు సంవత్సరాలుగా మామిడి పంట లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 15 సంవత్సరాల వయసున్న మామిడి తోటలు ఎండిపోవటం నిలబడిపోవటం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ మామిడి తోటలను రక్షించడానికి మైక్రో ఇరిగేషన్ పథకం ద్వారా, తగిన నిధులు సమకూర్చి, ఈ మామిడి తోటలను రక్షించ వలసిందిగా ఈ ప్రాంత ప్రజలందరూ కోరుతున్నారు.