ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా కత్తిపోటుకు గురయిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా నిరంతరాయంగా మిగతా ఏ రోజూ సెలవు తీసుకోకుండా జగన్ పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. మండు టెండల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ జగన్ పాదయాత్ర ఆగలేదు. అయితే, విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో దాడి అనంతరం ఆయన చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఆయన కు థ్రెట్ ఉన్న విషయం తెలంగాణ – ఏపీ ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి.తెలంగాణ ప్రభుత్వం వైఎస్ జగన్‌కు ప్రత్యేక భద్రత కల్పించింది. బుల్లెట్ ప్రూప్ వెహికల్‌ను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. అంతేగాకుండా ఆయన ఇంటి వద్ద కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. దాడి అనంతరం వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతిలో ఉన్నారు. త్వరలో పాదయాత్ర మొదలుపెట్టే అవకాశాలున్నాయి. అంతవరకు హైదరాబాదులో ఉంటున్న నేపథ్యంలో ప్రభత్వం ప్రత్యేక రక్షణ కల్పిస్తోంది.ఇక ఏపీలో జగన్ ప్రతిపక్ష నేత. అందుకే అక్కడ ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. త్వరలోనే జగన్ పాదయాత్ర మళ్లీ ప్రారంభించనున్న నేపథ్యంలో భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి జగన్ పాదయాత్రలో రెండంచెల భద్రత ఏర్పాటుచేస్తారు. ఇంతకుమునుపులా ఎవరు పడితే వారు జగన్‌తో సెల్ఫీ దిగే అవకాశం ఉండకపోవచ్చు. అధికారులు ఏర్పాటుచేసిన రెండంచెల భద్రతలోకి జగన్‌తో పాటు పోలీసులు అనుమతి అవసరం కావచ్చంటున్నారు.