YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రకాశంలో పతాక స్థాయికి విబేధాలు కాయకల్ప చికిత్స చేసిన చంద్రబాబు

 ప్రకాశంలో పతాక స్థాయికి విబేధాలు కాయకల్ప చికిత్స చేసిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. తమలో తామే కలహించుకుంటూ పార్టీని నిలువునా భ్రష్టు పట్టిస్తూ కేడర్‌ రెండుగా చీలడానికి కారణమైన ఎమ్మెల్యేలకు మీరు మారతారా ? లేదా నేను మీ సీట్లు మార్చేయనా అని వార్నింగ్‌ ఇచ్చారు. అసలు విషయంలోకి వెళితే ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబు తాజాగా రెండు రోజులు పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత ఒంగోలులో జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో టీడీపీకి పెద్ద తల నొప్పిగా మారిన కొండపి నియోజకవర్గ సమీక్షలో చంద్రబాబు సిట్టింగ్‌ ఎమ్మెల్యే డోలా బాలా వీరాంజనేయ స్వామితో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌కు, ఆయన సోదరుడు దామచర్ల సత్యకు సైతం తలంటేశారు.కొండపి నియోజకవర్గ టీడీపీ రెండేళ్లుగా జనార్ధన్‌, స్వామి వర్గాలుగా రెండుగా చీలిపోయింది. ఓ వర్గం స్వామిని సపోర్ట్‌ చేస్తుంటే మరో వర్గం స్వామిని తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. రెండేళ్లుగా పార్టీ పరిశీలకుల మధ్య‌వ‌ర్తిత్వంతో ఎన్నో సార్లు ఈ సమస్యను పరిష్కరించేందుకు సమావేశం అయినా ఈ వివాదం ఓ కొలిక్కి రాలేదు. చివరకు చంద్రబాబు వద్దే తాడో పేడో తేల్చుకోవాలని ఇరు వర్గాలు డిసైడ్‌ అవ్వడంతో చంద్రబాబు తన తాజా పర్యటనలో కొండపి పంచాయితిని తేల్చేయాలని డిసైడ్‌ అయ్యారు. ఈ క్రమంలోనే మీరు మారతారా లేదా మిమ్మల్ని మార్చేయాలా అని ఈ ముగ్గురికి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. కొండపి ఎమ్మెల్యే స్వామిని ఉద్ధేశించి నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపిస్తేనే తమరు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు తమరు ఒంటెద్దు పోకడలతో వారిని పక్కన పెడితే వారు మిమ్మల్ని కిందకు దింపేస్తారని హెచ్చరించడంతో స్వామి ముఖం మాడిపోయినట్టు తెలిసింది.అదే టైమ్‌లో నియోజకవర్గంలో మరో గ్రూపున‌కు నేతృత్వం వహిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్థన్‌కు సైతం అందరిని కలుపుకుని సమన్వయంతో పని చెయ్యాలని హెచ్చరించినట్లు సమాచారం. నిన్ను జిల్లా స్థాయి నాయ‌కుడిని చేయ‌డంతో పాటు ఎమ్మెల్యేను చేశాను.. కానీ నువ్వు గ్రూపు రాజ‌కీయాల‌ను ఎందుకు కంట్రోల్ చేయ‌లేక‌పోతున్నావ‌ని ఫైర్ అయ్యార‌ట‌. ఇక నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే స్వామి, దామచర్ల జనార్థన్‌ సోదరుడు సత్య ఓ వర్గంగానూ దామచర్ల జనార్థన్‌, జూపూడి ప్రభాకర్‌రావు మరో వర్గంగానూ ఉంటున్న సంగతి తెలిసిందే. దామచర్ల ఫ్యామిలీ రెండుగా విడిపోవడంతో బాబు సైతం అస‌హ‌నం వ్యక్తం చేశారు. నాలుగైదు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించుకుని నాకు నివేదికలు ఇస్తారా ? మిమ్మల్ని కార్యకర్తల స్థానాల్లో కూర్చోపెట్టమంటారా అని కూడా బాబు కాస్త సీరియస్‌ గానే వారిని ప్రశ్నించినట్టు సమాచారం.ఏదేమైనా బాబు ఎప్పట్నించో కొలిక్కి రాని కొండపి నియోజకవర్గ పంచాయితీకి బాబు తన తాజా పర్యాటనలో చాలా వరకు పుల్ స్టాప్‌ పెట్టినట్టే కనిపిస్తోంది. అలాగే పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందుల నారాయణరెడ్డిపై సైతం నియోజకవర్గానికి చెందిన కొందరు కీలక నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పార్టీ కేడర్‌ను ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదని నియోజకవర్గంలో కందుల కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువ అవుతుందని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై సైతం సీరియస్‌గా ఆలోచన చేసిన చంద్రబాబు నువ్వు మారాలని కందులను హెచ్చరించారు. అలాగే య‌ర్రగొండ‌పాలెంలో ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ప‌నితీరు స‌రిగా లేద‌ని.. నిన్ను మార్చేయాలా ? అని సైతం ఆయ‌న‌పై ఫైర్ అయ్యారు.సంత‌నూత‌ల‌పాడు ఇన్‌చార్జ్ బీఎన్‌.విజ‌య్‌కుమార్‌ను మార్చేయాల‌ని ఇప్పటికే నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు మండ‌లాల పార్టీ నాయ‌కులు రోడ్డెక్కారు. విజ‌య్‌కుమార్‌పై ఈ నియోజ‌క‌వర్గ నేత‌లు చాలాసార్లు సీఎంకు, లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న బాబు ఎంపీపీలు, మండల స్థాయి నేతలు చెప్పినట్లు ఎందుకు వినడం లేదంటూ బీఎన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా ప్రకాశం జిల్లా ప‌ర్యట‌న‌లో బాబు చాలా మంది నేత‌ల‌కు త‌లంటేయ‌డం రాజ‌కీయంగా చ‌ర్చనీయాంశ‌మైంది. గ్రూపు త‌గాదాల‌ను ఆయ‌న ఏ మాత్రం స‌హించే ప‌రిస్థితి లేద‌ని కుండ‌బ‌ద్దలు కొట్టేశారు. ఫైన‌ల్‌గా బాబు తన తాజా పర్యటనలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నుంచి చాలా మందికి హెచ్చరికలు ఇచ్చినా.. సీనియర్‌ రాజకీయ నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ప్రాధాన్యం ఇచ్చినట్లు అయ్యిందని టీడీపీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి

Related Posts