మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాత కాబోతున్నారు. 2016 మార్చిలో తన చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహం చేసుకుంది చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ. అంతకు ముందు శిరీష్ భరద్వాజ్ ను ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ.. వ్యక్తిగత కారణాలతో విడిపోయి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరికి నివ్రిత అనే ఐదేళ్ల కూతురు ఉంది. టెక్నాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లలో మాస్టర్ డిగ్రీ అందుకున్న కళ్యాణ్ దేవ్ స్వస్థలం చిత్తూరు. యూఎస్ఏ బేస్డ్ జ్యువెల్లరీ వ్యాపారి కెప్టెన్ కిషన్ కుమారుడే కళ్యాణ్ దేవ్. దేశ విదేశాల్లో వ్యాపారాలు సాగించిన అనుభవం కళ్యాణ్ దేవ్ కి ఉంది. కాగా ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ వ్యాపార కార్యకలాపాల నుండి సినిమాలలో హీరోగా టర్న్ తీసుకున్నారు. ఇటీవల ‘విజేత’ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు కళ్యాణ్ దేవ్. త్వరలో శ్రీజ, కళ్యాణ్ దేవ్ లు తల్లి తండ్రులు కాబోతున్నారు.