YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

లక్ష్మి కటాక్షం కోసం దీపావళి సాయంత్రం చేయవలసిన పనులు.

లక్ష్మి కటాక్షం కోసం దీపావళి సాయంత్రం చేయవలసిన పనులు.

1 . ముందుగా పూజా మందిరాన్ని శుభ్రంగా కడిగి, పువ్వులతో అలంకరించుకోవాలి.

2 . సూర్యాస్తమయం తర్వాత చీపురుతో చిమ్మకూడదు కాబట్టి, అంతకు మునుపే ఇల్లంతా చిమ్మి, శుభ్రంగా కడుక్కోవడం మంచిది.

3. గుమ్మం ముందు చక్కని ముగ్గువేసి(చిన్నదైనా, పెద్దదైన పర్లేదు), ముగ్గుని పువ్వులతో అలంకరించి, ముగ్గు మధ్యలో నెయ్యితోకాని, నువ్వుల నూనెతో కానీ ఒక పెద్ద దీపాన్ని, చుట్టూ చిన్న చిన్న చిన్న దీపాలను పెట్టండి. అది లక్ష్మిదేవి అమ్మవారిని ఆహ్వానించడం. సూర్యాస్తమయం అయినా కాస్సేపు దాక తలుపు తెరిచి ఉంచటం మంచిది. తులసి చెట్టు దగ్గర దీపారాధనం చేయడం, భక్తి, శ్రద్ధలతో పూజించడం మంచి ఫలితాన్నిస్తుంది.

4. ఇంట్లోని పూజామందిరంలో ఒక్క లక్ష్మిదేవినే కాకుండా, స్వామివారితో కలిసి ఉన్న అమ్మవారి చిత్రపటాలను లేదా మూర్తులను అంటే లక్ష్మీనారాయుణులను లేదా రాధాకృష్ణులను, సీతారాములను, లక్ష్మీవేంకటేశ్వరుల మూర్తులను పూజించడం వలన ఆయుస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, వ్యాపారం వృద్ధినొందుతాయి. 

5. లక్ష్మిఅష్టకం కానీ, అష్టోత్తరం, సహస్రనామం కానీ విష్ణు అష్టోత్తరం, విష్ణు సహస్రనామం, కృష్ణాష్టకం కానీ పారాయణం చేస్తే మంచిది.

6. పాయసం, చిత్రాన్నం, వడపప్పు కానీ, లేదా భక్తితో మీకు ఉన్నంతలో నైవేద్యం పెట్టి, దాన్ని ఇంట్లోని అందరికి పంచి పెట్టండి. ఏమి లేకపోయినా కాసిన్ని పాలని కృష్ణపరమాత్మకు నైవేద్యంగా పెట్టి, అందరికి పంచండి.

Related Posts