YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సండే..సందడే..సందడి

సండే..సందడే..సందడి

ఈ వారం పత్రికలు బడ్జెట్, ప్రత్యేకహోదా, సి.పి.ఎం రాష్ట్ర మహాసభలు (నల్గొండ, భీమవరం), ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక కథనాలతో ఎవరి నీడన వారు ఆకర్షణీయమైన కథనాలు అందించాయి.

'ఈనాడు' డిజిటల్ కథనాల విస్తీర్ణం పెంచగా, 'సాక్షి' ఏపి ఎడిషన్ లో 'జగన్ ఆశయం', తెలంగాణలో సమస్యలు చుట్టూ కథనాలను అందించాయి. సాక్షి, ఆంధ్ర జ్యోతి / ప్రభ / భూమి, వార్త /నవ / మన/ నా తెలంగాణ ఎడిటోరియల్ వాఖ్యానాలు ఆకట్టుకున్నాయి.
నమస్తే తెలంగాణ దూకుడు పెంచింది.

ఓ ప్రభుద్దుడు ఏకంగా ఊరినే తాకట్టు పెట్టి జల్సాలు చేస్తున్న వైనంపై "ఆంధ్రజ్యోతి" ఇచ్చిన కథనం జర్నలిస్టుల కష్టం చెప్పకనే చెప్పింది. సంచలనం రేకెత్తించింది.

ముచ్చట.కామ్ లో... అందరి చేత  ఎమ్మెస్సార్ గా ముద్దుగా పిలవబడే మంచాల శ్రీనివాస్ రావు  (+917702086787)
అందిస్తున్న కథనాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి...వ్యంగ్య అంశాలు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 'ఎన్నికల పరుగులు' ప్రారంభమైయ్యాయి. కొద్ది రోజుల్లో అసలు నిజాలు వెల్లడి అవుతాయని తెలుస్తుంది.

"సోషల్ ఆడిట్ ఒక్కదానికేనా..."
ఉపాధిహామీ పథకం కింద జరిగే పనులకు సోషల్ ఆడిట్... అంటూ.. ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం.

మరి ప్రతి కూలికి ఇచ్చే.. 197 రూపాయలకు... (అసలు దక్కేది వంద లోపేనని వినికిడి)
9 రకాల ఆడిట్ లు వెంటాడుతున్నాయి.

ప్రభుత్వం ఏటా ఖర్చుపెట్టే కోట్లాది రూపాయలకు... కూడా ఇదే విధమైన ఆడిట్ నిబంధనలు ఎందుకు ల్లేవ్.

ఎందుకంటే...
రాజకీయులు బతికేదే వీటిమీద...
ప్రభుత్వ పేరుతో జరిగే పనులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ కార్యకర్తలకు 'ఉపాధి' హామీ.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు "హోరు గాలిలో గగ్గోలు"

అధికారంలోకి రాగానే 'రాగాల పల్లకీకి హత్తుకుంటూ అల్లుకుపోవడం'

"లక్ష వెయ్యి కోట్లకు" లెక్కల్లేవ్..అంటేనే ఈ అవినీతి ప్రస్థానం ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది.

ఓ తెరాస ప్రముఖుడి వ్యవహార శైలిపై గులాబీ నేత గరం గరంగా ఉన్నారు.

ఆకట్టుకున్నాయి:
(1) నవ తెలంగాణ అందించిన 'ట్రాక్టర్లు టి.ఆర్.ఎస్ నాయకులకే' అంటూ కథనం ఇచ్చింది. లబ్దిదారుల పేర్లు , ఎలా, ఏ వరసకు బంధువు అంటూ సాక్ష్యాలతో ఇవ్వటం బాగుంది.
(ఇదే కథనాన్ని ఈరోజు 'ఈనాడు' అదే జిల్లాలో మరో కోణంలో రాసింది)

(2) 'ఈనాడు' మెయిన్ లో "విలువలు తగ్గుముఖం..
ఏటా 700 హత్యలు" అనే కథనం దిగజారుతున్న సామాజిక విలువల ప్రస్థావన ఆకట్టుకుంది.

పత్రికలకు అందని వార్తలు:
1) తెలంగాణ స్టడీ సర్కిల్‌లో 2014 నుంచి 2017 వరకు విద్యార్థుల అభ్యున్నతికి సర్కారు కేటాయించిన నిధుల్లో రూ.5.5కోట్ల మోసం జరిగింది.

2) బుల్లి బురిడీ బాబా (బాలసాయిబాబా)కు అతి తక్కువ ధరకు భూ కేటాయింపు.

3) తిరుమలలో అనధికార హోటళ్ళ వ్యాపారంపై హైకోర్టు సీరియస్.

4) సకల నేరస్థుల సర్వే పేరుతో పోలీసులు వ్యక్తిగత వివరాలు సేకరించడంపై హైకోర్టు మందలింపు.

5) అయేషా హత్య కేసులో న్యాయస్థానానికి ఆధారాలు సమర్పించిన 'సిట్'

వెలుగులో వచ్చేనా..
తెలుగు రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేషన్ అధికారులలో 100 మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితా "న్యూస్ పేజి"కి చిక్కినట్లు తెలుస్తోంది.

ఆందోళన కలిగించే విషయం
46,476 మంది బోదకాలు వ్యాధిగ్రస్థులకు 'ఫింఛన్' ఇస్తున్నామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన అభినందనీయం. ఇన్నేళ్లుగా ప్రభుత్వం ఈ వ్యాధి పట్ల చూపిన నిర్లక్ష్యం ఆందోళనకరం.

ఆకర్షణీయమైన శీర్షికలు:
1) గోదాముల్లోకి చేరుతున్న కందులు పుచ్చిపోథున్నాయని ఆంటూ........
పుచ్చు మోసం

2) జంతు సర్వే పై
 లెక్క తేలింది.. 

3) పురోగతి లేని ‘జీరోవేస్ట్‌ పంచాయతీ
కుదరని లంకె.. పనులు అంకె

4) ముంపు గ్రామాలలో లబ్దిదారుల 
జాబితాలో పేర్లు అంటూ దళారులు సాగించిన బేరసారాలపై కథనం
 పరిహారం... పందేరం!
అమ్మకానికి వెలిగొండ ప్యాకేజి

 5) టెండర్లు పిలవకుండానే ఎన్నెస్పీ పనుల్లో రాజకీయులకు వాటాలు
అంటూ ఇచ్చిన కథనం
అయ్యా... వీళ్లు ‘మామూలో’ళ్లు కాదు...!

6) ధాన్యం కొనుగోలు కేంద్రాల పేరుతో అడ్డదారి 
కళ్లం లేని అమ్మకాలు.. కళ్లెం లేని అక్రమాలు!!

7) పేరులోనే వసతి... ఏళ్లుగా దుస్థితి!

8) నిధులు కరిగాయ్‌.. పనులు నిలిచాయ్‌

9) పదేళ్లుగా కొనసాగుతున్న పోగొండ రిజర్వాయర్‌ పనులు
జల ‘ఆశ’యం
నత్తలా...

10) సీపీఎం పార్టీ రాష్ట్ర మహాసభలు ప్రారంభమైన రోజున.. 
"నల్గొండ.. ఎర్రగొండ"

11) రెండేళ్లకే ‘తారు’మారు..

12) కళ కోల్పోతున్న జీవ వైవిధ్య పార్కుపై 
ఉద్యాన ‘హీనం’
 
 13) తెలంగాణ ఆర్.టి.సి లో
రూ. 400 కోట్ల పీఎఫ్‌.. ఉఫ్‌!

13) బల్దియా మధ్య మండల  కార్యాలయంలో ప్రమాదంపై 
"విలువైన దస్త్రాలు మాయం చేసేందుకేనా..?" అంటూ వచ్చిన కథనం
ఆధారాలకు నిప్పు!

14)  రుణాలివ్వడంలో బ్యాంకుల జాప్యం చేస్తున్నా అంటూ.....
పంట బీమా.. లేదు ధీమా
 
15) రోడ్డు ప్రమాదంపై
 పదినిమిషాల్లో ప్రాణాలు మాయం!!

16) తీరుమార్చుకోని నిందితులపై పీడీ చట్టం ప్రయోగించనున్నారని
పోకిరీలపై ‘పిడి’కిలి!

17) గుళ్లో లింగాన్నీ మింగేస్తున్నారు..! 
సరిహద్దులు దాటిపోతున్న ‘దేవుళ్లు’
 
18) పోసిందే మట్టి .. చేసిందే పని
రూ.10 కోట్లు మట్టి పాలే

19) వాతావరణం మార్పులతో పడిపోయిన పసుపు ధర...
మబ్బులు చూపి మాయ చేసి

20)  బొబ్బిలి జలవనరులశాఖ కార్యాలయంలో దస్త్రాలు మాయమయ్యాయని....అంటూ ఇచ్చిన కథనం..
35 ఏళ్ల నాటి కథకు గల్లంతే ముగింపా?

21) 20వేల ఎకరాలకు పెరగనున్న చెరకుసాగు ..
తీపిపంట.. విస్తీర్ణం మెరుగంట

22) గాలి ముద్దుకృష్ణమనాయుడు... మరణం రోజున వచ్చిన కథనాలలో..
మాటల దాడి.. లోకం వీడి

23) నులి పురుగుల గురించిన కథనం...
ఆరోగ్యం ‘నులి’మేస్తుంది

24) నీలగిరి చెట్ల మొదళ్లు తొలగించిన తీసుకెళ్లారట.. అంటూ.....
చెవిలో చెట్లు పెడుతున్నారు

కొసమెరుపు: న్యాయస్థానంలో రికార్డుల ట్యాపింగ్ వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఓ.ఐ.పి.ఎస్ పై జరిగిన న్యాయవిచారణ కథ హైకోర్టుకు చేరింది.

                                                                                                   -  విశ్లేషణ: అనంచిన్ని వెంకటేశ్వరరావు,

Related Posts