కృష్ణా జిల్లాలో , గూడూరు మండలం లోని తరకటూరు గ్రామం, మచిలీపట్నం విజయవాడ NH మీద ఉంది. ఈ రోడ్డుకు ఇరువైపులా రైతులు ఇటు నుండి అటు వైపుకు వెళ్ళవలసి వస్తుంది పొలం పనుల గురించి. విజయవాడ మార్గంలో తరకటూరు కి ఒక కిలోమీటరు దూరంలో హైవే మీద డివైడర్ కట్ చిన్న గూడూరు లంక దగ్గర ఉంది . అదేవిధంగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నం వైపు నిడుమొలు దగ్గర డివైడర్ కట్ ఉంది. తరకటూరు ను ఆనుకొని అనేక గ్రామాలు( కాజా, మద్దిపట్ల, కొంచ కోడూరు, పెద్దరాయుడు తోట కొత్తపాలెం కోసూరు వీరాయలలంక ) ఉన్నాయి. రైతులకు రోడ్డుకు ఆ వైపుల పొలాలు ఉండటం వలన, పొలం పనుల , సరుకుల రవాణా విషయంలో రైతులు, బళ్ళు చాలా దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది లేదా ట్రాఫిక్ కి వ్యతిరేకంగా వెళ్ళ వలసి వస్తుంది. ఒకసారి తరకటూరు గ్రామస్తులు యొక్క సమస్యను ఆలకించి సరైన పరిష్కార మార్గం చూడాలి.