
దాదాపు ఆరు నెలల క్రితం కేరళలో జరిగిన ఓ పరువు హత్య కేసుకు సంబంధించిన విచారణ కోర్టులో ప్రారంభమైంది. తమ కుమార్తెను తీసుకెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడన్న కారణంతో, పెళ్లయిన రెండు రోజులకే ఓ యువకుడిని యువతి కుటుంబీకులు హత్య చేయించగా, ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. యువతీయువకులు కేరళలోని కొట్టాయంకు చెందిన నీనూ(21), జోసెఫ్(23). జోసెఫ్ బైక్ మెకానిక్‌గా పనిచేసేవాడు. వీరిద్దరి రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో జోసెఫ్ నీనూను తీసుకెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన యువతి కుటుంబం జోసెఫ్‌ను కిడ్నాప్ చేయించింది. కిడ్నాప్ అయిన మరుసటి రోజు అతని శవం చాలియెక్కర కెనాల్‌లో తేలియాడుతూ కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి కొట్టాయం అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. కోర్టు ఈ కేసును పరువు హత్యగా తేల్చింది. ఈ కేసు విచారణ ఆరు నెలల్లో పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించింది.