పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. నియోజవర్గంలో అభివృద్ధిపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్, టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజుల మధ్య సవాల్-ప్రతి సవాల్ తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అభివృద్ధిపై బహిరంగ చర్చకు వెంకటరామన్నగూడెంకు రావాలంటూ ఇరువర్గాలు సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో పోలీసులు ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.