పెద్ద నోట్లు రద్దయి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పెద్ద నోట్ల రద్దు ఒక ఉపద్రవమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా అన్నారు. ఈరోజు చీకటి దినం. పెద్దనోట్ల రద్దు ఉపద్రవంగా మారింది. అది జరిగి నేటికి రెండేళ్లు పూర్తయ్యింది. నేను దీనికి వ్యతిరేకంగా అప్పటి నుంచే పోరాడుతున్నాను. దీనిపై సామాన్య ప్రజలు, ఆర్థిక వేత్తల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమయింది. ఇది విఫలమైందని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ఓ భారీ కుంభకోణం. దీన్ని అడ్డం పెట్టుకుని భాజపా దేశాన్నే మోసం చేసింది. వారు చేసిన పనికి ఇప్పుడు ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు.’ అని ట్వీట్ చేశారు.