‘షకీలా’ బయోపిక్ అందరికీ కనువిప్పు కలిగిస్తుందని అంటున్నారు బాలీవుడ్ నటి రిచా చద్దా. సినీ నటి షకీలా జీవిత కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. రిచా చద్దా రీల్ లైఫ్ షకీలా పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘షకీలా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘నాట్ ఎ పోర్న్ స్టార్’ అనేది ఉపశీర్షిక. అయితే ఈ చిత్రం కోసం రిచా చద్దా ఐదు కిలోలు బరువు పెరిగారట. ఈ సినిమా కోసం రిచాను ఎంపికచేసుకున్నప్పుడు షకీలా..రిచాను చూసి ‘నువ్వు చాలా సన్నగా ఉన్నావ్. కండ కూడా లేదు’ అన్నారట. దాంతో బరువు పెరిగానని రిచా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చాలా మంది ‘షకీలా’ బయోపిక్‌ను ‘ది డర్టీ పిక్చర్’ సినిమాతో పోలుస్తున్నారు. కానీ ‘షకీలా’ బయోపిక్ విభిన్నంగా ఉంటుంది అని చాలా సార్లు చెప్పాను. సిల్క్ స్మిత చనిపోయినప్పుడు షకీలా సూపర్‌స్టార్ అయ్యారు. కాబట్టి సినిమాలో సిల్క్ స్మితా బతికున్నప్పుడు జరిగిన సంఘటనలు కూడా చూపించాల్సి ఉంటుంది. అందుకే అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సినిమాలో షకీలా ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి కూడా చూపించబోతున్నాం. ఈ సినిమా అందరికీ ఓ కనువిప్పు కలిగిస్తుందని మాత్రం చెప్పగలను’ అని వెల్లడించారు రిచా.