భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కొత్త అవరం ఎత్తబోతున్నాడు. దిల్లీ డేర్‌డెవిల్స్ తాజాగా తమ జట్టు సహయక సిబ్బంది విషయంలోనూ కీలక మార్పు చేసింది. దీనిలో భాగంగా వచ్చే సీజన్‌కుగానూ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌ను నియమించుకున్నట్లు ప్రకటించింది. ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌కు సమానంగా అన్ని రకాలు అధికారాలు కట్టబెడుతూ దిల్లీ ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా దిల్లీ ఫ్రాంఛైజీకి కైఫ్ ధన్యవాదాలు తెలిపాడు. దిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో భాగమైనందుకు నేను గర్విస్తున్నాను. ఫ్రాంఛైజీ, దేశం గర్వపడేలా చేసే యువకులతో కూడిన ఉత్తేజకరమైన జట్టును తయారుచేయడానికి నా వంతుగా పాటుపడతానని అతను పేర్కొన్నాడు.