YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ పేరు ‘భాగ్యనగర్‌’

అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ పేరు  ‘భాగ్యనగర్‌’
 వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ పేరును ‘భాగ్యనగర్‌’గా మారుస్తామని భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి రాజాసింగ్‌ ప్రకటించారు. గోషామహల్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న ఈయన గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.రాజాసింగ్ మాట్లాడుతూ..‘ వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెడుతుంది. తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రాంతాల పేర్లు మార్చి దేశానికి విశిష్ట సేవలందించిన మహనీయుల పేర్లు పెడతాం. హైదరాబాద్‌ను ‘భాగ్యనగర్‌’గా మార్చుతాం. సికింద్రాబాద్‌, కరీంనగర్‌ పేర్లనూ మార్చుతాం. 1590లో కులీ కుతుబ్‌ షా భాగ్యనగర్‌ను హైదరాబాద్‌గా పేరుమార్చారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని పేరు మార్చాలని అనుకుంటున్నాం. ఇప్పటికే భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రముఖ ప్రాంతాల పేర్లు మార్చుతున్నారు. ప్రముఖ మొఘల్‌సరయ్‌ రైల్వే స్టేషన్‌ను పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జంక్షన్‌గా పేరు మార్చిన విషయం తెలిసిందే. దేశసేవ చేసిన వారికి మేం ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం’ అని తెలిపారు.మరోవైపు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ పేరునూ మార్చే యోచనలో ఉన్నట్లు ఆరాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ తెలిపారు. అహ్మదాబాద్‌ పేరును ‘కర్ణావతి’గా మార్చాలని నిర్ణయించుకున్నామన్నారు. అయితే దీనికోసం న్యాయనిపుణుల సలహా కోరుతున్నామని రూపానీ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌‌, ఫైజాబాద్‌ను అయోధ్యగా పేర్లు మార్చిన విషయం తెలిసిందే.

Related Posts