కృష్ణా జిల్లా పెడనలో వైకాపా వర్గపోరు వీధికెక్కింది. జోగి రమేష్, ఉప్పాల రాంప్రసాద్ వర్గీయులు నడీరోడ్డుమీద దాడులు చేసుకున్నారు. కవ్వింపు చర్యలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్ లో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘటనలో జోగి రమేష్ కారు అద్దాలను ఉప్పాల వర్గీయులు ద్వంసం చేసారు. ఉప్పాల వర్గానికి చెందిన ఒకరిద్దరికి రక్తపు గాయాలు గాయాలు కావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ వల్లభనేని బాలసౌరి కార్యాలయ ప్రారంభోత్సవానికి తమ అనుయాయులతో వేర్వేరుగా భారీ ఊరేగింపుగా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసారు. ఇరువర్గాలను చెదరగోట్టారు.