YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఏపీ కుమారస్వామిగా పవన్....

ఏపీ కుమారస్వామిగా పవన్....
ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటూ.. తాజాగా ప్రకటించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. నిజానికి.. నిన్న మొన్నటి వరకు పవన్ తనకు అధికారం అవసరం లేదని, ప్రజల కోసం ఎంత వరకైనా పోరు చేస్తానని చెప్పుకొచ్చారు. అదేసమయంలో విపక్షం వైసీపీ అధికార దాహం పెరిగిందని కూడా అన్నా రు. తండ్రి పోస్టును అడ్డం పెట్టుకుని సీఎం అవ్వాలని జగన్ చూస్తున్నారని, ఇప్పుడు అధికార టీడీపీలోనూ ఇదే తరహా రాజకీయం నడుస్తోందని, లోకేష్ తన తండ్రి పీఠంపై కన్నేశాడని, అనుభవం లేకపోయినా సీఎం అయ్యేందుకు ప్రయ త్నాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఓ పదిరోజుల కిందట ధవళేశ్వరంలో కవాతు నిర్వహించిన సందర్భంగా కూడా.. ఇదే మాట చెప్పారు. ఇక, అదేసమయంలో కానిస్టేబుల్ కొడుకు.. సీఎం అవకూడదా? అంటూ సెంటిమెంటు బాణం ప్రయోగించారు. దీనిపై చర్చ కూడా జరిగింది. నిజమే రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటే.. ఖచ్చితంగా ఈ మార్పు వచ్చి తీరుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాత్రం తాజాగా.. తాను సీఎం ఖాయమనే వ్యాఖ్యలు చేశారు జనసేనాని. 2019లో మనదే అధికారం అనే ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ధీమా ఏంటనే విషయంపైనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి వారం రోజుల్లో రాష్ట్రంలో రాజకీయాలు మారిపోయాయి.టీడీపీ వెళ్లి కాంగ్రెస్తో చేతులు కలిపింది. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని చెబుతూనే కాంగ్రెస్తో టీడీపీ చేతులు కలుపుకోవడాన్ని సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక, కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తామని చెప్పిన చంద్రబాబు చెంతకు ఎలా వెళ్తామని కూడా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కొందరు పార్టీ వదిలి బయటకు వస్తున్నారు. ఇలా వచ్చిన వారు.. వచ్చే ఎన్నికల్లో పోటీకి మాత్రం దూరంగా ఉండే పరిస్థితి లేదు. అలాగని.. సొంతగా పోటీ చేసే స్థాయి కూడా లేదు. దీంతో వీరంతా.. ఇప్పుడు జనసేనకు తురుపు ముక్కల్లా ఉపయోగపడతారని అంటున్నారు పరిశీలకులు. జనసేన మరింతగా బలోపేతం అవుతుందని, వచ్చే ఎన్నికల్లో సీనియర్లకు అవకాశం ఇచ్చి. గెలిపించుకుంటే.. అధికారం తనదేనని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ ధీమానే పవన్ ఇలా వ్యాఖ్యానించేలా చేసిందని అంటున్నారు. మరోపక్క.. తన సోదరుడు, ఎంపీ చిరంజీవి కూడా ఎన్నికల సమయానికి తమ్ముడి పార్టీని బలపరిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో. పవన్ ఇలా వ్యాఖ్యానిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. లేదా కర్ణాటకలో కుమారస్వామిలా కింగ్ మేకర్ అవ్వాలని కూడా పవన్ ప్లాన్ చేస్తున్నట్టు మరో టాక్. మొత్తానికి పవన్లో పెరిగిన ధీమాతో కేడర్లోనూ ఉత్సాహం పుంజుకుంది.

Related Posts