ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై మాజీ మిస్ ఇండియా, తాజా హీరోయిన్ నిహారిక సింగ్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి... మోసం చేశాడని.. ఆయనకు ఎందరో మహిళలతో సంబంధాలున్నాయంటూ వ్యాఖ్యలు చేసింది. 2009లో మిస్ లవ్‌లీ అనే సినిమాలో నవాజుద్దీన్‌తో కలిసి నటించినట్టు నిహారిక తెలిపింది. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా ఒకరోజు తన ఇంటికి లంచ్‌కి నవాజుద్దీన్ పిలిచాడని.. అప్పటి నుంచి తరచూ కలుస్తూ ఉండేవారమని తెలిపింది. ఒకరోజు తన ఇంటి ముందు ఉన్నానని నవాజుద్దీన్ మెసేజ్ చేయడంతో ఇంట్లోకి ఆహ్వానించానని నిహారిక తెలిపింది. ఇంట్లోకి రాగానే తనను కౌగిలించుకున్నాడని అప్పటి నుంచి తమ రిలేషన్ కొనసాగుతోందని నిహారిక చెప్పుకొచ్చింది.