హైదరాబాద్ బంజారాహిల్స్ లో 3 ఎకరాల 13 గజాలు భూ వివాదం లో రియల్టర్ జీపీ రెడ్డి ని అరెస్ట్ చేయాలి. అయనక నేర చరిత్ర ఉంది. 2010 లో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారని హైకోర్టు న్యాయవాది శ్రీరంగారావు అన్నారు. శనివారం అయన మీడియతో మాట్లాడారు. జీపీ రెడ్డి ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ చెందిన 3ఎకరాల 13 గజాలు భూమి కి ఫోర్జరీ పత్రలు , నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ సోసైటి లో 12 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. 2016 లో నకిలీ పత్రాలు తో ఈ భూమిని రిజిస్టర్ చేశారు జీపీ రెడ్డి. గతంలో సొసైటీ సభ్యులు పోలీసులు కు ఫిర్యాదు చేశారని అయన వివరించారు. అప్పుడు జీపీ రెడ్డి కి చెందిన వ్యక్తులు పై ఫోర్జరీ , చీటింగ్, కేసులు పెట్టి రిమాండ్ కి తరలించారు. ఈ కేసులో పిచ్చి రెడ్డి ప్రమేయం ఉందని తెలిసినా అరెస్ట్ చేయలేదు. ఇలాంటి వారికి సహకరిస్తున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రెడ్డి పై కేసు పెట్టాలని అయన డిమాండ్ చేసారు. లగడపాటిపైఐపీసీ 353 కేసు పెట్టాలి, పొలీసులు విధులు కు ఆటంకం కలిగించారని శ్రీరంగారావు ఆరోపించారు.