- రోశయ్య గురించి మాట్లాడిన వెంకయ్య..
"రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన్ను సత్కారం మనం సంప్రదాయం. సినిమా అనేది తాత్కాలకి ఆకర్షణ. రోశయ్య ఏ బాధ్యతల్లో ఉన్నా.. పదవికి న్యాయం చేశారు. క్రమశిక్షణతో ఏదైనా సాధ్యం. ప్రజా జీవనంలో కట్టుబాటు చాలా ముఖ్యం" ఆయన అన్నారు. మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు జీవిత కాల పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ఉదయం రోశయ్యను సన్మానించారు. మాజీ గవర్నర్ రోశయ్యకు జీవిత కాల పురస్కార ప్రదానం కార్యక్రమంలో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోశయ్య.. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం మొదలైందన్నారు. " నాకు అన్ని పదవులు యాదృచ్చికంగా వచ్చాయి. నేనెప్పుడూ పదవులను దుర్వినియోగం చేయలేదు" అని రోశయ్య స్పష్టం చేశారు.