ఆదివారం నుంచి మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలో వుంటారు. నవంబర్ 11 నుండి 13 వరకూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. అక్కడ జరిగే గ్లోబల్ సదస్సులో మంత్రి పాల్గొంటారు. టెక్నాలజీ అనుసంధానం తో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పాలనలో తీసుకురావాల్సిన మార్పులు పై చర్చ జరగనుంది. 2019 దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి ఎజెండా తయారు చేసే సమావేశంలో కూడా లోకేష్ పాల్గొంటారు. గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ ఆన్ రష్యా (సైబర్ సెక్యూరిటీ, మైగ్రేషన్, ఎకనామిక్ ఛాలెంజెస్,టెక్నాలజీ డేవేలంప్మెంట్)తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈనెల 13 న దుబాయ్ లోని తెలుగువారితో సమావేశం కానున్నారు.