YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజస్థాన్ తప్ప..మిగిలిన మూడు కమలానివే

రాజస్థాన్ తప్ప..మిగిలిన మూడు కమలానివే
రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు తథ్యమని సీ-ఓటర్‌ సర్వేలో తేలగా.. తాజాగా టైమ్స్ నౌ- సీఎన్ఎక్స్ ప్రీ పోల్ సర్వే సైతం అదే విషయాన్ని వెల్లడించింది. టైమ్స్ నౌ- సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం.. డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 సీట్లకుగానూ 110-120 సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకోనుంది. కాగా, బీజేపీ 70-80 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితం అవుతుంది. 
బీఎస్పీ 1-3 సీట్లు, జాట్ నేత హనుమాన్ బెనివాల్‌కు చెందిన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ, ఇతరులకు కలిపి 7 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని సర్వేలో వచ్చింది. అశోక్ గెహ్లాట్ సీఎం కావాలిన 30.82 శాతం ప్రజలు కోరుకుంటుండగా.. ప్రస్తుత సీఎం, బీజేపీ నాయకురాలు వసుంధరా రాజేను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని 25.25 శాతం మంది భావిస్తున్నారు. ఇద్దరూ వద్దూ అని 10 శాతం ప్రజలు చెప్పగా, ఇద్దరూ మంచివాళ్లు కాదని సర్వేలో పాల్గొన్న 13.23 శాతం మంది చెప్పడం గమనార్హం. 
అయితే కాంగ్రెస్ నుంచి సచిన్ పైలట్‌ సీఎం అయితే బాగుంటుందని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. గత ఎన్నికల కంటే 10.4 శాతం ఎక్కువగా ఓట్లు సాధించి కాంగ్రెస్ 43.5 శాతం ఓట్లతో నిలవనుంది. కాగా, బీజేపీ ఓట్ల శాతం తగ్గింది. ప్రస్తుత ఎన్నికల్లో 4.8శాతం తగ్గి 40.37శాతం ఓట్లతో రెండో స్థానానికి పరిమితం కానుందని టైమ్స్ నౌ - సీఎన్ఎక్స్ సర్వేలో వెల్లడైంది. 
మధ్యప్రదేశ్ మళ్లీ బీజేపీదే 
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీ-ఓటర్‌ సర్వేలో తేలగా.. టైమ్స్ నౌ - సీఎన్ఎక్స్ సర్వేలో మాత్రం బీజేపీకి విజయం దక్కుతుందని వచ్చింది. వరుసగా నాలుగో పర్యాయం బీజేపీ నెగ్గి, శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం అవుతారని టైమ్స్ నౌ - సీఎన్ఎక్స్ సర్వేలో తేలింది. మొత్తం 230 సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 122 సీట్లు, కాంగ్రెస్‌‌కు 95 సీట్లు వస్తాయని తేలింది. అక్టోబర్ 25- నవంబర్ 3 తేదీల మధ్య ఈ సర్వే చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే బీజేపీ ఓటింగ్ శాతం 3 వరకు తగ్గనుంది. కాగా, కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెరగనుంది. 
టైమ్స్ నౌ - సీఎన్ఎక్స్ సర్వేలో సీఎం అభ్యర్థిగా చౌహాన్‌కు 40 శాతం ఓట్లు పడగా, కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌ సీఎం కావాలని 20.3 శాతం మంది కోరుకుంటున్నారు. సీఎం అభ్యర్థి రేసులో 19.7 శాతం ఓట్లతో జ్యోతిరాదిత్య సింధియా మూడో స్థానంలో నిలిచారు. 
రమణ్ సింగ్ రికార్డు స్థాయిలో నాలుగోసారి.. 
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నేత రమణ్ సింగ్ నాలుగోసారి సీఎం కానున్నారని ఇటీవల చేసిన ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ సర్వేలో తేలింది. 90 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 50 సీట్లు, కాంగ్రెస్ 30 సీట్లు, బీఎస్పీ-అజిత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌ పార్టీ 9 సీట్లు, ఇతరులు ఒక్క సీటు సొంతం చేసుకుంటారని సర్వేలో పాల్గొన్న ఓటర్లు చెప్పారు. బీజేపీకి 42 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 37 శాతం ఓట్లు, బీఎస్పీ- జోగి పార్టీ కూటమికి 7 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. 

Related Posts