అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతుండటంతో దేశీయంగా కూడా పెట్రోలు, డీజిల్ ధరలు శనివారం (నవంబరు 10) మరోసారి తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 17 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు ధరరూ.77.89 కి చేరింది. డీజిల్ ధర 16 పైసలు తగ్గి రూ.72.58 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో 17 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.83.40 కి చేరగా.. డీజిల్ ధర కూడా 17 పైసలు తగ్గి రూ.76.22 కి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 18 పైసలు తగ్గి రూ.83.15 గా ఉండగా.. డీజిల్ ధర 17 పైసలు తగ్గి రూ.79.31 గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.81.81 ఉండగా.. డీజిల్ ధర రూ.77.75 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌పై మరింత తగ్గి 70 డాలర్ల దిగువకు పడిపోయింది. సమావేశమవడానికి సిద్ధమవుతుండగా.. ఈ భేటీకి ముందే బ్యారెల్ ధర 70 డాలర్ల దిగువకు వెళ్లింది. అమెరికా చమురు నిల్వలు పెరుగుతున్ననేపథ్యంలో ఒపెక్ దేశాలు ఈ వారాంతంలో సమావేశమై ముడి చమురు ధరల తగ్గింపు అవకాశాల గురించి చర్చించనున్నాయి. ఒపెక్ సమావేశం నేపథ్యంలో త్వరలో ధరలు మరికాస్త తగ్గే అవకాశం ఉంది.