YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరైన జనార్దన్‌రెడ్డి

క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరైన జనార్దన్‌రెడ్డి
 రాజకీయ ఒత్తిడితోనే పోలీసులు తనను వేధిస్తున్నారని కర్ణాటక మాజీ మంత్రి, గాలి జనార్దన్‌ రెడ్డి ఆరోపించారు. శనివారం తన లాయర్‌తో కలిసి క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరయ్యారు.గొలుసు కట్టు వ్యాపారాలతో ప్రజలను కోట్ల రూపాయలకు మోసం చేసిన అంబిడెంట్‌ కంపెనీపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ కేసులు కొట్టివేయిస్తానని జనార్దన్‌ రెడ్డి రూ. 25కోట్లకు బేరం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అరెస్టు భయంతో గాలి, ఆయన అనుచరులు రహస్య ప్రదేశానికి వెళ్లిపోయారు. ఇదే సమయంలో ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని గాలికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గాలి నేడు వీడియో విడుదల చేశారు.కాగా.. ఈ కేసుకు సంబంధించి సీసీబీ పోలీసులను గాలి జనార్దన్‌ రెడ్డి గందరగోళానికి గురిచేశారు. శనివారం ఉదయం 10 గంటలకు క్రైమ్‌ బ్రాంచ్‌కు వస్తానని చెప్పడంతో ఏసీపీ వెంకటేశ్‌ ప్రసన్న నేతృత్వంలోని అధికారులు ఆయన కోసం ఎదురుచూశారు. అయితే తీరా మధ్యాహ్నం 3.45 గంటలకు గాలి సీసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే పోలీసులు మరో కేసు నిమిత్తం బయటకు వెళ్లిపోయారు. కాసేపటికే కార్యాలయానికి చేరుకున్న పోలీసులు గాలి జనార్దన్‌ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు.అంబిడెంట్‌ కంపెనీ తరఫున ఈడీకి లంచం ఇచ్చేందుకు మధ్యవర్తిత్వం నడిపి కనబడకుండా పోయిన కర్ణాటక మాజీ మంత్రి, గాలి జనార్దన్‌ రెడ్డి అజ్ఞాతం వీడారు. మీడియాలో వెలువడుతున్నట్లుగా తాను ఎక్కడకీ వెళ్లలేదని, బెంగళూరులోనే ఉన్నానంటూ న్యాయవాదితో కలిసి మాట్లాడుతున్న వీడియోను మీడియాకు విడుదల చేశారు. తాను పరారీలో ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు చిత్రీకరిస్తున్నాయని ఆరోపించిన గాలి ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలు సహా అనుమానాలను నివృత్తి చేసేందుకే ఈ వీడియోను విడుదల చేస్తున్నట్లు చెప్పారు.ఈ కేసులో తనకు కేంద్ర క్రైమ్‌ బ్రాంచీ నుంచి నోటీసులు అందాయని, న్యాయవాదుల సలహా మేరకు సీసీబీ ఎదుట హాజరవుతున్నట్లు తెలిపారు. తాను ఏ తప్పూ చేయలేదని, అందుకే బెంగళూరు విడిచి వెళ్లలేదని తెలిపారు. బెంగళూరులో ఉంటూ మీడియా ద్వారా కేసుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని జనార్దన్‌ రెడ్డి పేర్కొన్నారు. 

Related Posts