తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రులు మహేష్ శర్మ, అశ్విని కుమార్ ఛౌబెయి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామసమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో కేంద్రామంత్రులకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఆలయం అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందచేసారు.ఆలయం వెలుపల మిడియాతో మాట్లాడుతూ దేశం శుబిక్షంగా వుండలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.ఎర్రచందనం అక్రమరవాణకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తున్నామని దీనికి సంబంధించి టాస్క్ పోర్స్ పూర్తి స్థాయిలో పని చేస్తుందన్నారు కేంద్రమంత్రి