YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి అవినీతి ప్రధానికి కనబడటం లేదా:రాహుల్

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి అవినీతి ప్రధానికి కనబడటం లేదా:రాహుల్
 ‘తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని మోదీ చెప్పుకుంటున్నారు. కానీ‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ అవినీతిపరుడన్న విషయాన్ని మాత్రం చెప్పరు. ప్రజల సొమ్ము రూ.5,000 కోట్లు చిట్‌ఫండ్‌ కుంభకోణంలో మాయమయ్యాయి. దీనిపై 310 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కానీ, ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు.  అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రధానమంత్రి ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై మాత్రం మౌనం వహిస్తున్నారని విమర్శించారు. అలాగే, ఆయన 15 మంది పారిశ్రామికవేత్తలకు చెందిన రూ.3.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని మరోసారి ఆరోపించారు. ఈ నెల 12న ఆ రాష్ట్ర అసెంబ్లీ తొలిదశ పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని చరామా ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ ప్రసంగిస్తూ... ‘ఈ నాలుగైదేళ్లలో ప్రధాని మోదీ.. 15 మంది సంపన్నులకు రూ.3.5 లక్షల కోట్లు ఇచ్చారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశ వ్యాప్తంగా అమలు కావడానికి ఏడాదికి రూ.35,000 కోట్లు అవసరం. అందుకు ఏకంగా 10 రెట్ల నగదును 15 మంది పారిశ్రామికవేత్తలకు ఆయన ఇచ్చేశారు. మా పార్టీ అధికారంలోకి వస్తే అదే డబ్బును దేశంలోని రైతుల, యువత, పేదల, మహిళల, గిరిజనుల కోసం ఖర్చు చేయాలనుకుంటోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.ఎందుకంటే ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. పనామా పేపర్లలో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి కుమారుడి పేరు వెలుగు చూసింది. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదన్న విషయాన్ని ప్రజలకు రమణ్‌ సింగ్‌ తెలపాలి. పనామా పేపర్లలో పేరు బయటకు వచ్చినందుకు పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీష్ కూడా జైలుకు వెళ్లారు’ అని రాహుల్‌ విమర్శించారు. ‌మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌.. ఐదేళ్లలో వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధి సాధించి దేశం మొత్తానికి పండ్లు, కూరగాయలు, బియ్యం సరఫరా చేసే రాష్ట్రాలుగా ఉండాలని తాను కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌ మొదటి దశ పోలింగ్‌ ఈ నెల 12న, రెండో దశ 20న జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఈ నెల 28న ఎన్నికలు జరుగుతాయి.

Related Posts