YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీ రామ! నీ నామము ఎంతో రుచి రా..!!

 శ్రీ రామ!  నీ నామము ఎంతో రుచి రా..!!

పేరు ఆదిలక్ష్మి
73 సంవత్సరాల యువతి
ఊరు వేణుగోపాలపురం కోడూరు మండలం కృష్ణా జిల్లా!!
వృత్తి రామాలయంలో పూజారిని.

ప్రవృత్తి రామాలయానికి , గ్రామ ప్రజలకు సేవ చేయటం.

కృష్ణా జిల్లా కోడూరు మండలం, వేణుగోపాలపురం గ్రామస్తురాలు,  73 సంవత్సరాల యువతి అయినా ఆదిలక్ష్మి గారిని రామాలయంలో కలవటం వారితో ముచ్చటించటం ఒక అదృష్టం.

గత 30 సంవత్సరాలుగా రామాలయం సేవలు, నిర్విరామంగా చేస్తూ ,  ఎప్పుడూ నవ్వుతూ  ఆదిలక్ష్మి గారు గ్రామస్తులు అందరి మన్ననలు పొందారు.

కార్తీకమాసం వచ్చిందంటే చాలు 40 మంది గ్రామ మహిళలతో గాయత్రి మంత్రం జపం చేస్తూ గ్రామ  సంకీర్తన చేస్తూ, కృష్ణా నది ఒడ్డుకు వెళ్లి చల్లటి నీటిలో స్నానం చేసి మహిళలందరూ మరల నగర సంకీర్తన చేసుకుంటూ శివాలయం కి వెళ్లి దీపం వెలిగించి గ్రామం మరియు కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ ఉంటారు.

కార్తికమాసం లో నాల్గవ ఆదివారం ఆదిలక్ష్మి గారు గ్రామస్తులు అందరి తో త్రిమూర్తుల పూజ కృష్ణానది ఒడ్డున నిష్టతో గ్రామస్తులు అందరూ సుఖంగా ఉండాలని సంకల్పంతో మూడు గంటలసేపు ప్రార్థనలు చేస్తారు.

ఈ వయసులో కూడా ఒంటరిగా ఉంటూ రాముని సేవించుకుంటూ గ్రామ ప్రజల సుఖ సంతోషాల గురించి పాటుపడుతున్న టువంటి వేణుగోపాలపురం ఆదిలక్ష్మిగారికి పాద నమస్కారాలు చేసినప్పుడు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.

Related Posts