మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిని సీసీబీ పోలీసులు ఆదివారం అరెస్ట్‌చేశారు. నిన్న మధ్యాహ్నం 4 గంటల నుంచి అర్ధరాత్రి 3గంటల వరకు ఏకధాటిగా గాలిని విచారించిన సీసీబీ పోలీసులు ఆదివారం ఉదయం 9గంటల నుంచే మళ్లీ ఆ ప్రక్రియను ప్రారంభించారు. ఈ విచారణకు హాజరైన అంబిడెంట్ ఎండీ ఫరిద్, జనార్దన్ రెడ్డి పీఏ అలీఖాన్‌ను బయటకు పంపినా జనార్దన్ రెడ్డిని సీసీబీ కార్యాలయంలోనే ఉంచారు. ఒంటరిగా ప్రశ్నించిన సందర్భంలో ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని చెప్పిన గాలి.. ఫరిద్ ఎదురుగా ఉన్నప్పుడు మాత్రం తాను సాయం చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. సుదీర్ఘ విచారణ తర్వాత సీసీబీ పోలీసులు గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. విచారణలో జనార్దన్ రెడ్డి పోలీసులను అస్తవ్యస్తమైన సమాధానాలతో తికమక పెట్టినట్లు సమాచారం.