YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఏపీకి జపాన్ కంపెనీ

ఏపీకి జపాన్ కంపెనీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో టాప్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ రానుంది. జపాన్ పానసోనిక్ దిగ్గజమైన 'యాంకర్ ఎలక్ట్రానిక్స్' ఆంధ్రప్రదేశ్ లో తన ఉత్పత్తి కార్మాగారాన్ని తెరవబోతుంది. దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్లు నిర్మిస్తున్నారు. అయితే దీంతో ఆంధ్రప్రదేశ్లో సుమారు రెండువేల ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఇందులో 70 శాతం మహిళలకు కేటాయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న 8 ఫ్యాక్టరీల్లో కంపెనీకి 9వేల మంది ఉద్యోగులున్నారు. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీ వెంచర్లో ఈ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు.ఈ కంపెనీలో ఫ్యాన్లు, కేబుల్ వైర్స్, స్విచ్ బోర్డులు, స్విచ్ డేరింగ్ వంటి ఉత్పత్తులు తయారు చేస్తామని యాంకర్ ఎలక్ట్రానిక్స్ ఎండి వివేక్ శర్మ పేర్కొన్నారు. ఈ ప్లాంట్ 2020 నాటికి సిద్ధం కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ వైరింగ్ మార్కెట్లో దాదాపు 36శాతం వాటాను కంపెనీ దక్కించుకుంది. రానున్న రెండేళ్లలో ఈ వాటాను మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వివేక్ తెలిపారు. 2018 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 28శాతం పుంజుకొని రూ.2,980కోట్లుగా నమోదయ్యింది.వార్షిక వృద్ధి రేటు 13శాతం పెరిగింది. రానున్న ఐయిదేళ్లలో కంపెనీ వార్షిక వృద్ధిరేటు 20 శాతానికి మంచి సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తుందని యాంకర్ ఎండి వివేక్ పేర్కొన్నారు. డబుల్ డిజిట్ వృద్ధి రేటు సాధించడానికి తగు ప్రణాళికలు కూడా రూపొందించినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. రానున్న 5 ఏళ్ళల్లో కంపెనీ వార్షిక వృద్ధి రేటు (CAGR) 20 శాతంకు మించి సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తుందని యాంకర్ ఎండీ వివేక్ పేర్కొన్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ వైరింగ్ మార్కెట్లో దాదాపు 36 శాతం వాటాను యాంకర్ దక్కించుకుంది. రానున్న రెండేళ్ళల్లో ఈ వాటాను మరింత పెంచుకోవాలని యోచిస్తున్నట్టు వివేక్ తెలిపారు.

Related Posts