ఛత్తీస్‌గఢ్‌లో శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 90 స్థానాలున్న శాసనసభలో మొదటిదశలో బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, బస్తార్, సుక్మా, రాజనందగావ్, దంతెవాడ జిల్లాలోని 18 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు పోలింగ్‌కు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనారాం సాహూ పార్టీకి రాజీనామా చేశారు. ఈనెల మొదట్లో ఆపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, గిరిజన నేత రామ్‌దయాళ్ ఉయికే భాజపాలో చేరిన విషయం తెలిసిందే.