YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ రామనామ జపం

కాంగ్రెస్ రామనామ జపం
మధ్యప్రదేశ్ లో కమలం హవాకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అన్ని అస్త్రాలు సిద్ధం చేస్తుంది. అవసరమైతే మైనారిటీ ఓట్లను సైతం పక్కన పెట్టి బిజెపి కన్నా ఎక్కువ రామభజన చేయడానికి రెడీ అయిపొయింది హస్తం పార్టీ. పంచాయితీ ల పరిధిలో గోశాలల ఏర్పాటు, నిధులు కేటాయిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టో లో ప్రకటించింది. రాముడు 14 ఏళ్ళ వయస్సులో నడయాడిన ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా చేస్తామని ప్రకటించింది. రాంపద్, నర్మదా పద్ ప్రాంతాలు 50 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇలా పూర్తిగా బిజెపి బాటలోకి మారిపోయింది కాంగ్రెస్.ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అన్నదే ప్రస్తుతం రాజకీయ పార్టీలకు ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది. ఏపీలో తమ బద్ద విరోధి టిడిపి తో జట్టు కట్టి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది రాహుల్ నాయకత్వం. తాజాగా ఇప్పుడు మరికొన్ని కొత్త, వింత చర్యలకు కాంగ్రెస్ దిగడం చర్చనీయాంశం అయ్యింది. మధ్యప్రదేశ్ లో అధికారం అందని ద్రాక్షగా కాంగ్రెస్ కి మారింది. దాంతో ఈసారి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఢీకొని హస్తం పార్టీ అధికారం దక్కించుకునేందుకు బిజెపి రూటే ఎంచుకుంది.తమ పార్టీ ఓటు బ్యాంక్ తమతో ఎలానూ ఉంటుంది కనుక బిజెపి ఓటు బ్యాంక్ కి చిల్లు పెట్టి అధికారపార్టీకి చుక్కలు చుపించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం. అందుకే పూర్తిగా బిజెపి వారికే దిమ్మతిరిగే హామీలను ఇస్తూ, హిందుత్వ జపాన్ని పెద్ద ఎత్తున మొదలు పెట్టింది. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న రైతులను తమ వైపునకు తిప్పుకునేందుకు రుణమాఫీని కూడా ప్రకటించింది. ఉద్యోగావకాశాల కల్పనకు హామీలిచ్చింది. మరి ఈ ఎత్తులన్నీ ఫలిస్తాయో లేదో డిసెంబర్ 11 ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పనున్నాయి.

Related Posts