ఛత్తీస్గఢ్ శాసనసభకు ఎన్నికలు పద్దెనిమిది స్థానాల్లో సోమవారం జరిగాయి. భారీ భద్రత నడుమ జరిగిన పొలింగ్ లో ఉదయం 11 గంటల వరకూ 16.4 శాతం పోలింగ్ నమోదైంది. పదినియోజక వర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. మిగిలిన 8 స్థానాల్లో పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇది సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగింది. నారాయణపూర్, దంతెవాడ, బిజాపూర్, కొంట, మొహ్లా-మాన్పూర్, అంతగఢ్, భానుప్రతాప్పూర్, కంకేర్, కేష్కల్, కొండగావ్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఖైరాగఢ్, డొంగర్గఢ్, రాజ్నంద్గావ్, దొంగర్గావ్, ఖుజ్జి నియోజక వర్గాలతోపాటు బస్తర్, జగ్దల్పూర్, చిత్రకూట్ నియోజక వర్గాల్లో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మిగిలిన 72 స్థానాలకు ఈనెల 20 ల ఎన్నికలు జరగనున్నాయి. మావోయిస్తు ప్రభావితమున్న ప్రదేశాలోనే సోమవారం ఎన్నికలు జరిగాయి. ఈ పద్దెనిమిది స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, మిగతా స్థానాల్లో బీజేపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వున్నారు.