YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

పెళ్లిలో రజనీకాంత్‌ కుటుంబం సందడి

 పెళ్లిలో రజనీకాంత్‌ కుటుంబం సందడి

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుటుంబం ప్రముఖ దర్శకుడు వైజీ మహేంద్ర కుమారుడు హర్షవర్ధన పెళ్లి వేడుకలో సందడి చేసింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ శుభకార్యంలో రజనీతోపాటు ఆయన సతీమణి లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, అల్లుడు ధనుష్‌ పాల్గొన్నారు. లతకు మహేంద్ర బంధువు అవుతారు. తలైవా కుటుంబ సభ్యులు అందరూ ఉన్న ఈ ఫొటోలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.మహేంద్ర తన నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో దాదాపు 200 సినిమాల్లో నటించారు. పలు టెలివిజన్‌ సిరీస్‌లోనూ నటించారు. వేదికలపై ప్రదర్శన కూడా ఇచ్చారు. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఆయనకు వరుసకు సోదరుడు అవుతారు. రజనీకి లతను ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె తల్లిదండ్రులను మహేంద్రనే ఒప్పించినట్లు చెబుతుంటారు.

రజనీ ఖకాలా’, ఖ2.ఓ’ సినిమా షూటింగ్‌లు పూర్తి చేసుకున్నారు. ఖకాలా’ను ఏప్రిల్‌ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజనీ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఖ2.ఓ’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోంది. వీఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తి కాని కారణంగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూనే ఉంది. దీని తర్వాత రజనీ కొత్త సినిమాపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేపథ్యంలో తీస్తున్న సినిమాలో ఆయన నటించనున్నారని, దీని తర్వాత ఆయన నటనకు స్వస్తి పలకనున్నారని కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

Related Posts