YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు
 బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతకు ముందు వరుసగా నాలుగు సెషన్లలో రూ.620 మేర తగ్గిన ధరలు.. పెళ్లిళ్ల సందడి మొదలు కావడంతో.. సోమవారం రూ.80 పెరిగింది. దీంతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.32,070 నుంచి రూ.32,150కి పెరిగింది. తాజా పెంపుతో.. దేశ రాజధాని ఢిల్లీలో 80 పాయలు పెరిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,150కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,000 కి చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.24,800 వద్ద కొనసాగుతోంది. మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. నేటి ట్రేడింగ్లో రూ.150 పెరిగిన కిలో వెండి ధర రూ.38,150కి చేరింది. వారాంతపు డెలివరీ వెండి ధర రూ.235 పెరిగి 37,115కి చేరింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.75,000 ఉండగా.. అమ్మకం ధర రూ.76,000 వద్దే స్థిరంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు తగ్గాయి. సింగపూర్లో 0.41 శాతం తగ్గిన ఔన్సు బంగారం ధర 1,205.50 డాలర్ల వద్ద స్థిరపడింది. వెండి కూడా 0.11 శాతం తగ్గి ఔన్సు వెండి ధర 14.23 డాలర్ల వద్ద ముగిసింది. 

Related Posts