స్మార్ట్ ఫోన్‌ల మూలంగా పలు యాప్‌లతో పాటు యూట్యూబ్ ఛానళ్లు కూడా మొబైళ్లలో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇక నెట్‌ఫ్రీ కావడంతో యూట్యూబ్ ఛానళ్లకు డిమాండ్ మామూలుగా లేదు. ఈ ఛానళ్లలో సినిమాలకు సంబంధించిన ఎన్నో వీడియోలను ఉచితంగా చూడవచ్చు. ముఖ్యంగా యూత్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా యూట్యూబ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలను చూస్తూ పూర్తి వినోదాన్ని పొందుతున్నారు.ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి కేంద్రంగా యూట్యూబ్ ఛానల్స్ నిలుస్తున్నాయి. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిన తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం చిత్ర పరిశ్రమలకు సంబంధించిన ఛానల్స్ నేడు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పలువురు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఒకప్పుడు షార్ట్‌పిల్మ్‌మేకర్సే. షార్ట్‌ఫిల్మ్స్‌ను రూపొందించి వాటిని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా రిలీజ్ చేసి తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారు. అనంతరం చిత్ర పరిశ్రమలో సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం రావడంతో వారు తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకొని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లుగా నిలిచారు. ఈవిధంగా యంగ్ టాలెంట్‌కు యూట్యూబ్ వరప్రసాదంగా మారింది. ‘మహానటి’ దర్శకుడు నాగ్‌అశ్విన్, ప్రభాస్‌తో ‘సాహో’ను తెరకెక్కిస్తున్న దర్శకుడు సుజిత్, ‘దేవ్‌దాస్’ దర్శకుడు శ్రీరావ్‌ు ఆదిత్య, ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్, ‘అందాల రాక్షసి’ దర్శకుడు హను రాఘవపూడి, ‘సమ్మోహనం’ దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, ‘ఉయ్యాలజంపాల’ దర్శకుడు విరించి వర్మ, ‘అ..!’ దర్శకుడు ప్రశాంత్ వర్మ, ‘సూర్య వర్సెస్ సూర్య’ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ దర్శకుడు మెర్లపాక గాంధీ… ఈవిధంగా ఎంతో మంది షార్ట్‌ఫిల్మ్ మేకర్స్ నేడు టాలీవుడ్‌లో యంగ్ డైరెక్టర్లుగా రాణిస్తూ దూసుకుపోతున్నారు. యూట్యూబ్ పుణ్యమా అని ఈ డైరెక్టర్లు షార్ట్‌ఫిల్మ్స్‌తో తమ దర్శకత్వ ప్రతిభను చాటుకున్నారు. ఇక ఎటువంటి ఖర్చు లేకుండా షార్ట్‌ఫిల్మ్స్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే అవకాశం ఉండడంతో యువ దర్శకులకు ఎంతో మేలు జరుగుతోంది. పలువురు యువ నటీనటులకు కూడా షార్ట్‌ఫిల్మ్స్ వల్ల తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి దోహదపడుతున్నాయి. యూట్యూబ్‌లో ప్రసారమైన పలు షార్ట్‌ఫిల్మ్ ద్వారా పలువురు యువ నటీనటులకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. షార్ట్‌ఫిల్మ్ ద్వారా వచ్చిన రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, వైవా హర్ష, చందు సాయి, సుదర్శన్ తదితరులు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు.యువ దర్శకులు సొంతంగా తమ షార్ట్‌ఫిల్మ్స్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే అవకాశం ఉండడంతో వారికి ఎంతో మేలు జరుగుతోంది. అలాగే ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్స్‌ను ప్రసారం చేయవచ్చు. ఇక ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా పరిచయం కావాలంటే నానా కష్టాలు పడాల్సి వచ్చేది. సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కోసం నిర్మాతను కలిస్తే… ఏ దర్శకుల వద్ద పనిచేశారు? ఎన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేశారు? అని అడిగేవారు. వీటికి సరైన సమాధానం వచ్చినప్పటికీ కొత్త దర్శకులను పరిచయం చేయడానికి నిర్మాతలు ముందుకు వచ్చేవారు కాదు. రిస్క్ ఎందుకని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినీ ఇండస్ట్రీలో డైరెక్షన్ ఛాన్స్ దొరకాలంటే నిర్మాతలు ఒక్కటే అడుగుతున్నారు. ఎన్ని షార్ట్‌ఫిల్మ్స్ చేశారు? అని. ఆ షార్ట్‌ఫిల్మ్స్‌ను చూసి వారి ప్రతిభను తెలుసుకొని యంగ్ టాలెంట్‌కు సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక పాపులర్ డైరెక్టర్లు కూడా షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందిస్తూ యూట్యూబ్‌లో ద్వారా రిలీజ్ చేస్తున్నారు. కొంత కాలం క్రితం దర్శకుడు రావ్‌ుగోపాల్‌వర్మ తెరకెక్కించిన ‘జిఎస్‌టి’ షార్ట్‌ఫిల్మ్ యూట్యూబ్ ద్వారా విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అదేవిధంగా ఇటీవల బాలీవుడ్ బ్యూటీలు కియారా అద్వానీ, రాధికాఆప్టే, భూమి ఫడ్నేకర్, మనీషా కోయిరాలా ప్రధాన పాత్రల్లో నటించిన ‘లస్ట్‌స్టోరీస్’ షార్ట్‌ఫిల్మ్ కూడా యూట్యూబ్‌లో రిలీజై సందడి చేసింది. నలుగురు పాపులర్ బాలీవుడ్ డైరెక్టర్లు అనురాగ్ కశ్యప్, కరణ్ జోహార్, జోయా అక్తర్, దివాకర్ బెనర్జీ కలిసి ఈ షార్ట్‌ఫిల్మ్‌ను తెరకెక్కించడం విశేషం. అదేవిధంగా తెలుగులో జగపతిబాబు, నవదీప్, సుమంత్ అశ్విన్, నిహారిక, ధన్య బాలకృష్ణ, అదితి మ్యాకల్ తదితరులు నటించిన చేసిన వెబ్‌సిరీస్‌లు, షార్ట్‌ఫిల్మ్స్ కూడా యూట్యూబ్‌లో రిలీజై ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం పలువురు స్టార్ డైరెక్టర్లు పాపులర్ నటీనటులతో వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తున్నారు.ఈ వెబ్‌సిరీస్‌లను కూడా యూట్యూబ్ ఛానళ్ల ద్వారానే రిలీజ్ చేస్తున్నారు. ఇక తెలుగులో ముద్దపప్పు ఆవకాయ, మహాతల్లి, గీత సుబ్రమణ్యం, పెళ్లి గోల, ఎందుకిలా, నేను మీ కళ్యాణ్, నేను నా గర్ల్‌ఫ్రెండ్ వంటి పాపులర్ వెబ్‌సిరీస్‌లకు ప్రేక్షకుల ఆదరాభిమానాలు లభించాయి.తెలుగులో మ్యాంగో, ఐడ్రీమ్, ఓల్గా, సిల్లీమాంక్, పక్కింటికుర్రాడు, మహాతల్లి, బవ్‌ుచిక్ బబ్లూ, దేతడి, క్రేజీఖన్నా, ఫన్‌పటాకా, సిఎపిడిటి తదితర పాపులర్ తెలుగు యూట్యూబ్ ఛానళ్లకు ఎంతో క్రేజ్ ఉంది. సినిమాలు, ట్రైలర్లు, హీరోహీరోయిన్లు, దర్శకుల ఇంటర్వూలు, సినిమా ఫంక్షన్లు, షార్ట్‌ఫిల్మ్స్, కామెడీ, యాక్షన్ సీన్లు తదితరాలను ఈ ఛానళ్లలో చూడవచ్చు. ఇక సినిమాల ప్రమోషన్లలో కూడా యూట్యూబ్ ఛానళ్లు ప్రధాన భూమికను నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరోల సినిమాలను ఈ ఛానళ్ల ద్వారా భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు.మన దేశంలోని వివిధ భాషల చిత్ర పరిశ్రమల ద్వారా ప్రతి వారం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. నేడు సినీ ఇండస్ట్రీలో యూట్యూబ్ ఛానళ్లు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. పలు ఛానళ్లు సినిమా వినోదాన్ని అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం మ్యాంగో, ఐడ్రీవ్‌ు, ఓల్గా, సిల్లీమాంక్, పక్కింటికుర్రాడు, మహాతల్లి, బవ్‌ుచిక్ బబ్లూ, దేతడి, క్రేజీఖన్నా, ఫన్‌పటాకా, సిఎపిడిటి తదితర యూట్యూబ్ ఛానళ్లు సినిమా వినోదం ద్వారా ప్రతి నెల లక్షలాది రూపాయలను సంపాదిస్తున్నాయి. ప్రతి వీడియోకు మధ్యలో యూట్యూబ్ వారు తమ యాడ్స్‌ను పొందుపరుస్తున్నారు. ఈ యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం సంబంధిత యూట్యూబ్ ఛానళ్లకు వెళ్తోంది. అదేవిధంగా అత్యధికంగా సబ్‌స్ర్కైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానళ్లకు వ్యూవర్స్ మూలంగా కూడా ఆదాయం వస్తోంది. యూట్యూబ్ నుంచి సంబంధిత ఛానళ్ల బ్యాంక్ అక్కౌంట్‌కు డబ్బులు జమ అవుతుంటాయి. ఇక ఎవరైనా యూట్యూబ్ ఛానళ్లలో తమ వీడియోలను షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి వీడియోలకు 50 వేల మంది వ్యూవర్స్ ఉంటే వారికి ప్రతి నెల యూట్యూబ్ నుంచి ఆదాయం వస్తుంది.తెలుగులోని ఎన్‌టివి, టి న్యూస్, టివి9, టివి5, మహాటివి, ఈటివి, వి6, హెచ్‌ఎంటివి తదితర న్యూస్ ఛానళ్లకు యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. ఇవి శాటిలైట్ లింక్డ్ యూట్యూబ్ ఛానళ్లు. వీటిలో టివి ఛానళ్లలో ప్రసారమయ్యే కార్యక్రమాలను చూడవచ్చు. అదేవిధంగా లైవ్ ప్రోగ్రావ్‌ులను కూడా ఈ యూట్యూబ్ ఛానళ్లలో వీక్షించవచ్చు. అయితే న్యూస్ ఛానళ్ల యూట్యూబ్ ఛానళ్లకు ప్రతి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. కొంతకాలం క్రితం క్యాస్టింగ్‌కౌచ్ విషయంలో శ్రీరెడ్డితో నిర్వహించిన ప్రోగ్రామ్ లు కొన్ని టివి ఛానళ్లలో ప్రసారమైన విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన శ్రీరెడ్డి వీడియోలు యూట్యూబ్‌లో సందడిచేశాయి. వీటిమూలంగా పలు టివి ఛానళ్లకు లక్షలాది రూపాయల ఆదాయం రావడం విశేషం.యూట్యూబ్ ఛానళ్లలో వస్తున్న వీడియోలు, కంటెంట్‌లు సెన్సార్ లేకుండానే ప్రసారమవుతున్నాయి. షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్‌లు, సినిమా ట్రైలర్లు, ఇంటర్వూలు, పలు కార్యక్రమాలకు సెన్సార్ జరగడం లేదు. యూట్యూబ్ ఛానళ్లపై ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో పలువురు అశ్లీల వీడియోలను యూట్యూబ్‌లో ప్రసారం చేస్తున్నారు. పలు బూతు షార్ట్‌ఫిల్మ్స్, వెబ్‌సిరీలకు కూడా ఇది కేంద్రంగా మారడం విచారకరం. కొందరు నటులు ఈ బూతు షార్ట్‌ఫిల్మ్స్, వెబ్‌సిరీస్‌ల ద్వారానే పాపులారిటీ సంపాదించుకోవడం గమనార్హం.చిత్ర పరిశ్రమలోకి ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ వచ్చినప్పుడే సినిమాల్లో కొత్తదనం కనిపిస్తుంది. రొటీన్ సినిమాలను నేడు ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కి కొత్తదనం ఉన్న సినిమాలకే ప్రేక్షకుల ఆదరాభిమానాలు దక్కుతున్నాయి. అయితే నేడు సినీ ఇండస్ట్రీలోకి షార్ట్‌ఫిల్మ్స్ ద్వారానే యంగ్ టాలెంట్ వస్తోంది. షార్ట్‌ఫిల్మ్స్ ద్వారా యంగ్ డైరెక్టర్లు, యువ నటీనటులు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఈ ప్రతిభావంతులకు నేడు చిత్ర పరిశ్రమలో సులభంగా అవకాశాలు వస్తున్నాయి. అయితే షార్ట్‌ఫిల్మ్స్ విడుదలకు యూట్యూబ్ ఛానళ్లు నేడు కేంద్రంగా మారాయి. అంతేగాకుండా యూట్యూబ్ ఛానళ్లు నేడు సినిమా ప్రమోషన్లకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నెట్ ఫ్రీ కావడంతో ప్రస్తుతం అందరూ మొబైళ్లలో ఉచితంగా యూట్యూబ్ ఛానళ్లను తిలకిస్తూ వినోదాన్ని పొందుతున్నారు. అయితే ఇందులో చెడు కూడా ఉన్నప్పటికీ మంచిని మాత్రమే గ్రహించి వ్యూవర్స్ వినోదాన్ని పొందాలి. యూట్యూబ్ ఛానళ్లపై నియంత్రణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.యంగ్ టాలెంట్‌కు షార్ట్‌ఫిల్మ్స్ మంచి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ షార్ట్‌ఫిల్మ్‌లను యూట్యూబ్‌లో ఎటువంటి ఖర్చు లేకుండా సులభంగా విడుదల చేయడం జరుగుతోంది. దీంతో యువ దర్శకులు, నటీనటులకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కలుగుతోంది. షార్ట్‌ఫిల్మ్స్ ద్వారా తామేంటో నిరూపించుకునే యూత్‌కు ఆతర్వాత సినిమాల్లో చేసే అవకాశం కలుగుతోంది. ఒకప్పుడు యువతీయువకులు సినిమాల్లో ఛాన్స్ కోసం ఎంతో కష్టపడేవారు. సినీ నిర్మాతలు, దర్శకుల చుట్టూ తిరిగేవారు. కానీ ఇప్పుడు షార్ట్‌ఫిల్మ్స్‌లో చేసే యూత్ ప్రతిభను గుర్తించి ఫిల్మ్‌మేకర్స్ సినిమాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు.సినిమాల నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న పని. చిన్న సినిమాల విడుదలకు థియేటర్లు దొరకడం చాలా కష్టం. అయితే షార్ట్‌ఫిల్మ్‌ను చాలా తక్కువ ఖర్చుతో మనం అనుకున్నవిధంగా తెరకెక్కించవచ్చు. వీటిని యూట్యూబ్‌లో సులభంగా రిలీజ్ చేయవచ్చు. అందుకే యంగ్ ఫిల్మ్‌మేకర్స్‌కు యూట్యూబ్ గొప్ప వరం. కొత్త నటీనటులకు అవకాశం కల్పిస్తూ వారిని ప్రోత్సహించేందుకు షార్ట్‌ఫిల్మ్ ఎంతగానో దోహదపడుతాయి. ప్రస్తుతం షార్ట్‌ఫిల్మ్ దర్శకులు, నటీనటులకు టాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న కొందరు పాపులర్ యంగ్ డైరెక్టర్లు, నటులు షార్ట్‌ఫిల్మ్ నుంచి వచ్చినవారే.