ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన మర్డర్ అటెంప్ట్ పక్కా స్కెచ్ అని ఇప్పటికే చాలామంది అనుమానాలు వ్యక్తంచేసిన విషయం చూశాం. అయితే, దర్యాప్తులో అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బయటకు వచ్చిన సెక్యూరిటీ రిపోర్ట్ ని పరిశీలిస్తే ఓ షాకింగ్ విషయం బయటపడింది. నిందితుడు శ్రీనివాస్ కి చెక్ ఇన్ ఏరియాకు తాత్కాలికంగా ప్రత్యేక అనుమతి మంజూరు చేసినట్టు రిపోర్టు తేల్చింది. నిర్ఘాంత పోయే ఈ నిజాం మీడియాను షేక్ చేస్తోంది.
ఇవీ వివరాలు.. క్యాంటీన్ లో పనిచేసే శ్రీనివాస్ కి ఎయిర్ పోర్ట్ చెక్ ఇన్ ఏరియా దాటి వెళ్లే అవకాశం లేదు. బీసీఏఎస్ నుంచి అతనికి ఎలాంటి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా లేదు. అయితే, అనూహ్యంగా అక్టోబర్ 1 నుంచి 30 వ తారీఖు వరకు ఎయిర్ పోర్ట్ లో ఆయనకు ప్రత్యేక అనుమతులు దక్కాయి. వాటికి ఆధారాలు బయటపడ్డాయి. ఈ పరిణామం అనుమానాలకు తావిస్తోంది. ఇన్నాళ్లుగా టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలకు ఇది బలం చేకూరుస్తోంది. కేంద్రం ఆధీనంలో ఉండే ఎయిర్ పోర్ట్ లో ఒక సామాన్యుడికి ప్రత్యేక అనుమతులు ఎలా వచ్చాయని అందరూ విస్మయం వ్యక్తంచేస్తున్నారు.ఫ్లైట్ చెక్ ఇన్ వరకూ కూడా వెళ్లడానికి శ్రీనివాస్ కి ప్రత్యేకంగా తాత్కాలిక అనుమతులు వచ్చాయి. ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఈ అనుమతులు జారీచేశారు. ముంద ప్లాన్ చేసిన దాడి కావడం వల్లే అక్టోబర్ మాసం వరకు అతనికి ప్రత్యేక అనుమతి లభించిందా అన్న అనుమానాలు ఇపుడు కలుగుతున్నాయి. అయితే, ఈ అనుమతులు వెనుక ఎవరున్నదీ ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. అక్టోబర్ 25నాడు వైజాగ్ లో జరిగిన ఘటనకు ముందు జరిగిన ఈ పరిణామాలు ఇది కచ్చితంగా ప్లానే అని వస్తున్న ఆరోపణలను నిజం చేసేలా ఉన్నాయి. ఈ ఆధారాలతో కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సిట్ పోలీసుల విచారణ లో అతి కీలక ట్విస్ట్ బయట పడింది. తొమ్మిది ఫోన్లు మార్చి, ఎక్కువ సమయం ఫోన్ కాల్స్ మాట్లాడిన నిందితుడు శ్రీనివాసరావు ఫోన్ కాల్ లిస్ట్ లో ఎక్కువ ఫోన్ కాల్స్ ఒకే నంబర్ కి వెళ్ళటం ఆసక్తికరంగా మారింది. అయితే ఆ నంబర్ ఎవరిది అని అని ఆరా తీసినపుడు ఆ నంబర్ విజయ సాయి రెడ్డి వద్ద కొన్ని నెలల క్రితం పనిలో చేరిన వ్యక్తిదని, విజయ సాయిరెడ్డి వైజాగ్ లో కాంప్ వేసి ఉత్తరాంధ్రలో పార్టీ ని బలోపేతం చేసే క్రమంలో ఆ వ్యక్తి పని లో చేరాడని అంటున్నారు. ఒక ఉత్తరాంధ్ర నాయకుడి అనుచరుడు అయిన సదరు వ్యక్తి తో శ్రీనివాస రావు ఎక్కువ సార్లు ఫోన్ మాట్లాడాడని ఆధారాలు దొరికాయట. దీంతో కోడికత్తి దాడి నిజంగానే సింపతీ కోసం చేసిన డ్రామానా అని టీడీపీ వ్యక్తంచేసిన అనుమానాలు నిజం అయ్యేలా కనిపిస్తున్నాయి. త్వరలో ఇది ఆధార సహితంగా నిరూపితం అవుతుందంటున్నారు తెలుగుదేశం నేతలు. వీలైనంత త్వరగా మరింత లోతుగా విచారణ జరిపి అసలు సూత్రధారులన బయటపెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.