రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ దంపతులను ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి కలిసి తన పెళ్లికి ఆహ్వానిం చారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 18న ఆమె సొంత రాష్ట్రం జమ్మూ కశ్మీర్ వివాహ వేదికగా కానుంది. ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో ఆమ్రపాలి ఏడు అడుగులు వేయనున్నారు. అనంతరం వధువరులు ఆమ్రపాలి-సమీర్ తమ పెళ్లి విందును ఈ నెల 23న వరంగల్‌లోని అర్బన్ కలెక్టర్ కార్యాలయంలో, 25వ తేదీన హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. వరంగల్‌లో జరిగే విందుకు తన సన్నిహితులు, ప్రముఖులను ఆహ్వానిస్తుండగా, హైదరాబాద్‌ల జరిగే వివాహ విందుకు కూడా ప్రజాప్రతినిధులు, ప్రముఖులను ఆహ్వాని స్తున్నారు. ఈ విందుకు సంబంధించి ఇప్పటికే ఆహ్వానపత్రికలు కూడా సిద్ధం చేసేశారు. ఇందులో భాగంగానే ఆమె గవర్నర్ దంపతులను కలిశారు.
వరంగల్ విందులో 'వారం' తికమక..
అయితే వరంగల్ అర్బన్ కలెక్టర్ కార్యాలయంలో జరిగే ఆమ్రపాలి-సమీర్‌ల వివాహ విందు కోసం ముద్రించిన ఆహ్వాన పత్రికలో అచ్చు తప్పు దొర్లింది. ఆ ఆహ్వానపత్రికలో విందు తేదీ ఫిబ్రవరి 23 శుక్రవారానికి బదులుగా (ఫిబ్రవరి 23, ఆదివారం) అని తప్పుగా పడింది. ఆహ్వానపత్రికలు పంచే క్రమంలో అచ్చు (వారం తికమక) తప్పును గుర్తించి సరిచేసి శుక్రవారంగా స్టిక్కర్ వేసి అతిథులకు అందజేస్తున్నారట. కాగా, ఈ నెల 26 నుంచి మార్చి 7 వరకు నూతన వధువరులుగా భర్త సమీర్‌తో కలిసి కలెక్టర్ ఆమ్రపాలి హనీమూన్ కోసం టర్కీ వెళ్లనున్నారు.