YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటక లో కాంగ్రెస్ అసమ్మతి గళం

 కర్ణాటక లో కాంగ్రెస్ అసమ్మతి గళం
మళ్లీ కర్ణాటకలో కాంగ్రెస్ కు అసమ్మతి సెగ రాజుకునేలా ఉంది. ఉప ఎన్నికల్లో ఇటీవల సాధించిన ఘన విజయంతో అసమ్మతి అటకెక్కుతుందని అందరూ భావించారు. ప్రజలు తమ పక్షాన ఉండటంతో ఇక అసమ్మతి నేతలు కూడా తోక ముడుస్తారని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరలు అంచనా వేశారు. కానీ మళ్లీ మంత్రివర్గ విస్తరణ ముందుకొచ్చింది. గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ జరగుతుందని ఆశావహుల్లో ఆశలు రేపారు. మొన్న దసరా పండగకే మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉండగా ఉప ఎన్నికల పేరిట దానిని వాయిదా వేశారు.ఉప ఎన్నికలు ముగియడంతో మళ్లీ అసమ్మతి నేతల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కలసి పనిచేస్తేనే పదవులు దక్కుతాయని హైకమాండ్ ఆదేశించడంతో కాంగ్రెస్ లోని అసమ్మతి నేతలంతా విజయంకోసం చెమటోడ్చారు. దాని ఫలితమే ఐదు ఉప ఎన్నికల్లో నాలిగింటిని జేడీఎస్, కాంగ్రెస్ లు చేజిక్కించుకున్నాయి. ఈనెల 15 తర్వాత మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున ఎప్పుడు సమయం కేటాయించేదీ తమకు తెలియదని చెబుతున్నారు.మంత్రివర్గ విస్తరణ జరపకుంటేనే మేలన్న అభిప్రాయం రాష్ట్ర అగ్రనేతల్లో వ్యక్తమవుతోంది. మంత్రివర్గ విస్తరణ జరిపితే చోటు దక్కని వారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాండ్ ఇస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అలాగని జరపకుండా ఉన్నా తమ సత్తా చాటే అవకాశముందని కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ మెజారిటీ నేతలు వచ్చే లోక్ సభ ఎన్నికల వరకూ మంత్రి వర్గ విస్తరణ జరపకుండా ఉంటేనే మేలని కొందరు హైకమాండ్ కు సూచించాలన్న ఆలోచనలో ఉన్నారు.మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా వేసినా కాంగ్రెస్ అసమ్మతి సెగ తాకే అవకాశముందంటున్నారు. తమకు గత ఆరు నెలలుగా ఆశచూపిస్తూ మళ్లీ సార్వత్రిక ఎన్నికల తర్వాత అంటే తమ దారి తాము చూసుకోక తప్పదని కొందరు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప అవకాశం వస్తే వదిలి పెట్టకూడదన్న యోచనలో ఉన్నారు. తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే ఆశలు వదులుకోలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు అసమ్మతి వాదులు తన గూటికి వస్తారన్న అభిప్రాయం కావచ్చు. మొత్తం మీద కర్ణాటక కాంగ్రెస్ లో మంత్రి వర్గ విస్తరణ లేకుంటే మరోసారి అసమ్మతి రాజుకునే అవకాశముందన్నది విశ్లేషకుల అభిప్రాయం

Related Posts