YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుకు ఇక చుక్కలే ఉత్తరాంధ్రలో బలంగా జనసేన,వైసీపీ

చంద్రబాబుకు ఇక చుక్కలే ఉత్తరాంధ్రలో బలంగా జనసేన,వైసీపీ
విశాఖ జిల్లాలో సున్నా నుంచి మొదలు పెట్టిన జనసేన ఇపుడు మెల్లగా బలం పుంజుకుంటోంది. మూడు నెలల క్రితం జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రను నిర్వహించినపుడు జిల్లాలో అభిమానులే తప్ప పార్టీకి సరైన నాయకులే లేరు. అటువంటిది ఇపుడు చాలా చోట్ల బలమైన నాయకులు పార్టీలో వచ్చి చేరుతుండడంతో పోటీకి నేను సైతం అంటూ జనసేన ఉరకలు వేస్తోంది.విశాఖ జిల్లా టీడీపీకి కంచుకోట. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఇక్కడ జనం మాత్రం సైకిల్ పార్టీనే ఆదరిస్తారు. 2004, 2009లో తప్ప మిగిలిన ఎన్నికలన్నిటిలోనూ టీడీపీ హవా బలంగా చాటుకుంది. ఆ పార్టీకి మెరికల్లాంటి కార్యకర్తలు, ధీటైన నాయకులు జిల్లా అంతటా ఉన్నారు. దాంతో టీడీపీని ఢీ కొట్టడం అంటే అంత ఈజీ కాదన్నది అందరి మాటగా ఉంది. 2014 ఎన్నికల్లో వైసీపీకి ఎంత ఊపు ఉన్నా సరైన వ్యూహాలు లేకపోవడంతో పాటు, ప్రజలు సైతం టీడీపీ పట్ల మోజు పెంచుకోవడం వల్ల మూడంటే మూడు సీట్లకు పరిమితమైంది. ఇపుడు ఆ కంచుకోటలో ఏమైన మార్పు రాబోతుందా అన్నదే చూడాలి.ఇక పోతే జనసేన సొంతంగా ఒక్క నాయకుడిని తయారు చేసుకోలేకపోయినా వలసలను బాగా జిల్లాలో ప్రోత్సహిస్తోంది. అదే ఆయుధంగా నమ్ముకుని ఎన్నికల గోదాలోకి దిగిపోతోంది. ఆ పార్టీ మొదట ద్వితీయ శ్రేణి నాయకులపైన కన్ను వేసింది. ఇపుడు ఏకంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులపైనే గురి పెట్టింది. ఇపుడు జిల్లాలోని పదిహేను నియోజకవర్గాల్లో చూసుకుంటే జనసేనకు అర డజను సీట్లో గెలుపు దిశగా నడిపించే బలమైన నాయకులు ఉన్నారంటే గొప్పగానే చూడాలి. మిగిలిన చోట్ల కూడా ధీటైన అభ్యధుల కోసం ఆ పార్టీ వేట ముమ్మరంగా సాగుతోంది.జనసేన జిల్లాలో ఎంత ఎదిగితే అంత టీడీపీ, వైసీపీ నష్టపోక తప్పదు. జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో కాపులు పెద్ద సంఖ్యలో ఉండడం, పవన్ మ్యానియా బలంగా ఉండడం జనసేనకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. అదే టైంలో టీడీపీ, వైసీపీల్లోకి వెళ్ళలేని వారికి జనసేన మంచి ఆల్టర్నేషన్ గా కనిపిస్తోంది. పవన్ సైతం ఉదారంగా సీట్ల విషయంలో హామీలు ఇవ్వడంతో కొత్త పార్టీ వైపుగా సీనియర్ నాయకులు సైతం పరుగులు తీస్తున్నారు.ఇప్పటికి ఉన్న సమాచారం మేరకు టీడీపీ, వైసీపీల్లో మరింత మంది అసంతృప్తులు, బడా నాయకులు జనసేనలోకి వస్తారని అంటున్నారు. అదే జరిగితే జిల్లాలో ఇంతవరకూ సాగుతున్న ద్విముఖ పోరు కాస్తా త్రిముఖ పోరుగా మారే అవకాశం ఉంది. జనసేన నాయకుడు పవన్ సైతం వ్యూహాత్మకంగా నెలలో రెండు సార్లు విశాఖలో విడిది చేయడం ద్వారా పార్టీ పట్టును బాగా పెంచుకుంటున్నారు. చూడాలి రాజకీయం ఇంకెలా మారుతుందో

Related Posts