తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ శివన్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామసమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో శివన్ కు వేదపండితులు వేదశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. భారత దేశా కమ్యూనికేషన్ రంగంలో విప్లవమాత్మక మార్పులు తీసుకు రావడానికి ప్రతిష్టాత్మకమైన జిఎస్ఎల్వి మార్క్ 3 డి 2 మిషన్ ను వాతావరణం సహకరిస్తే రేపు ఉదయాన లాంచ్ చేయనున్నట్లు శివన్ పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా కమ్ముకాశ్మీర్, మరియు నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో కనెక్టివిటీ కోసం ముఖ్యంగా ఈ శాటిలైట్ ఉపయోగ పడుతుందని ఆయన తెలిపారు. డి 2 విజయవంతం అయితే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కలిగిన శాటిలైట్ ను అదించేందుకు వీలు ఉంటుంది అని శివన్ అన్నారు. దీని విజయం అనంతరం చంద్రాయన్ 2, గగనాయన్ ప్రోగ్రాం మాన్ మిషన్ ను సిద్ధం అవుతామని ఆయన పేర్కొన్నారు.