YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తుఫాన్ బాధితులకోసం పశువైద్య విద్యార్ధుల విరాళం

తుఫాన్ బాధితులకోసం పశువైద్య విద్యార్ధుల విరాళం
గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు  తమ ఒక రోజు భోజనం ఖర్చు ను తిత్లీ తుఫాను బాధితులు కోసం సీఎం సహాయనిధికి  విరాళంగా 60 వేల రూపాయలు అందజేశారు. మంగళవారం సీఎం చంద్రబాబును కలిసి విరాళం తాలుకు చెక్ ను అందచేసారు. తుఫాను బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన విద్యార్థులను సీఎం అభినందించారు. ప్రతి ఒక్కరు స్ఫూర్తి తీసుకుని సాయం చేసేందుకు ముందుకు రావాలని  అయన   పిలుపునిచ్చారు. 250 గ్రామీణ పశువైద్య కేంద్రాలను వెటర్నరీ డిస్పన్సరీ లుగా  ఉన్నతీకరించాలని సీఎంకు  వెటర్నరీ విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం చదివి సమస్యపై సానుకూలంగా స్పందించారని  ఆంధ్రప్రదేశ్ పశువైద్య పట్టభద్రుల ,విద్యార్ధి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై. యశ్వంత్ నాయుడు తెలిపారు. తిత్లీ తుఫాను బాధితుల కోసం ముఖ్యమంత్రి తీసుకున్న సహాయచర్యలు ఎంతో స్ఫూర్తివంతమని,  సీఎం కష్టానికి అసరా నిలబడాలనే ఉద్దేశంతో తుఫాను బాధితులకు సాయం చేశామన్నారు.

Related Posts