వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 17.6 శాతం అభివృద్ధి సాధించాం. మైక్రో ఇరిగేషన్లో దేశంలో రాష్ట్రానికి తొలిస్థానంలో ఉన్నాం. డైరెక్ట్ బెనిఫిట్ సిస్టంలో ముందు వరుసలో ఉన్నాం. భూసార పరీక్షల్లో రాష్ట్రానిదే ప్రధమస్థానం, 34.5 శాతం వర్షపాతం లోటుందని లో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ తిత్లీ తుపాను బాధితులను ఆదుకున్నాం. రూ. 3,800 కోట్ల మేరకు మార్కెట్ స్థిరీకరణ నిధులు వెచ్చించి ఆదుకున్నాం. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉంటే కేంద్రం స్పందించడం లేదని అన్నారు. కేంద్రం రాజకీయాలకు అతీతంగా రైతులను ఆదుకోవాలి తప్ప కక్ష్యపూర్వకంగా వ్యవహరిస్తోంది. స్వామినాథన్ కమిషన్ సిపార్సులను కేంద్రం ప్రకటనలకే పరిమితం చేసింది. వర్షాభావంతో రాష్ట్రానికి 6 జిల్లాల్లో 1658 కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పటికే 315 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాం. కొత్తగా 33 మండలాలు కరవు మండలలుగా ప్రకటన చేస్తున్నాం. ఇందులో కర్నూలు జిల్లాలో 16 మండలాలు, విజయనగరం జిల్లాలో 17 మండలాలున్నాయి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు కంటి తుడుపుగా మారాయి తప్ప దేనికి పనికిరావడం లేదు. తిత్లీ తుపాను బాధితులను సరిగ్గా ఆదుకోలేదు, రూ. 3,600 కోట్ల నష్టం జరిగితే 220 కోట్లిచ్చి కేంద్రం చేతులు దులుపుకుంది. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు పై కక్ష్య పెంచుకొని రైతులను,ప్రజలను ఇబ్బందులు పెట్టడం మంచి పద్దతి కాదని మంత్రి అన్నారు.