టీడీపీ స్ట్రాటజీ కమిటీతో సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, 2019 ఎన్నికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల్లో ఉండేవారికే పార్టీ తరపున ప్రాధాన్యత ఉండబోతుందని స్పష్టం చేశారు. 13 రోజుల్లో సభ్యత్వ నమోదు 8.92 లక్షలకు చేరిందని వెల్లడించారు. భేటీలో ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇస్తానని వెల్లడించారు. నిరంతరం ప్రజల్లో ఉండేవారికి ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపారు. ఈనెల 20వతేదీన నెల్లూరు, 27వతేదీన విజయనగరంలలో ధర్మపోరాట సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చివరి ధర్మపోరాట సదస్సు కృష్ణా, గుంటూరు జిల్లాల ఉమ్మడి సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు జాతీయ పార్టీల నేతలు హాజరవుతారని తెలిపారు. అలాగే, ఈనెల 15,16 తేదీల్లో జరగనున్న 'జయహో బీసీ' వర్క్షాప్ను జయప్రదం చేయాలన్నారు. బీసీ కులాల నేతలు హాజరై చర్చించాలని సూచించారు.