- . 71మంది సజీవ దహనం
మాస్కో సమీపంలో సరటోవ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 71 మంది మరణించినట్లు సమాచారం. చనిపోయిన వారిలో 65దాకా ప్రయాణికులు, ఆరుగురు ఎయిర్‌లైన్స్ సిబ్బందిగా తెలుస్తోంది. మాస్కోకు సమీపంలోని రమెన్స్కీ జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ప్రమాదం జరిగిన అరుగ్‌నోవో గ్రామంలోని కొందరు ప్రజలు గాల్లో నుంచి విమానం కింద పడి పేలిపోవడం చూసినట్లు తెలిసింది. ఆంటోనోవ్ ఏఎన్-148 విమానం ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. 71మందిలో ఎవరూ ప్రాణాలతో మిగిలి ఉండరని రష్యా ఎమర్జెన్సీ వర్గాలు ప్రకటించాయి. 11.22 నిమిషాలకు బయల్దేరిన ఈ విమానం 5నిమిషాల తర్వాత సిగ్నల్స్‌కు అందుబాటులో లేకుండా పోయినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. మాస్కో విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద ఘటనపై రష్యా దర్యాప్తు కమిటీ విచారణ చేపట్టింది.