YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

క్షయవ్యాధి నియంత్రణలో కర్నూలుకు ఆవార్డు

క్షయవ్యాధి నియంత్రణలో కర్నూలుకు ఆవార్డు
2017  సంవత్సరానికి ఉత్తమ టిబి కంట్రోల్ సెంటరుగా  కర్నూలు జిల్లాకు ప్రధమ అవార్డు దక్కింది. ఈ స్పూర్తితో మరింత అంకితాభావంతో పనిచేసి కర్నూలును టిబి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎన్.సత్యనారాయణ అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యలయం జిల్లా టిబి కంట్రోల్ ఆఫీసరు,  డియం అండ్ హెచ్ ఓకు అవార్డు నందించి కలెక్టరు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ట్యూబర్ కులోసిస్ అసోసియోషన్  ఆధ్వర్యంలో 36వ ఆంధ్రప్రధేశ్ ట్యుబర్ కులోసిస్, చెస్ట్ డిసీజెస్ కాన్ఫరెన్స్ మదనపల్లె సమీపంలో వున్న ఆరోగ్య వరం మెడికల్ సెంటరు లో ఈ నెల 10,11 తేదీలలో రెండు రోజులపాటు జరిగింది. ఈ కాన్పరెన్స్ లో జిల్లాలో 2017 సంవత్సరంలో మొత్తం 7,292 టిబికేసులు గుర్తించి వారికి వైద్య సేవలను అందించడంతో 91 శాతం సక్సెస్ రేటు లభించడంతో ఈ అవార్డును అందచేసారు.  దీనితో పాటు ఈ రంగంలో ఉత్తమ ప్రతిభ చూపిన జిల్లా టిబి కంట్రోలింగ్ ఆఫీసరు డా.శ్రీదేవికి అవార్డు దక్కింది. ఈ సందర్భంగా  డియం అండ్ హెచ్ఓ డా. ప్రసాద్, జిల్లా టిబి కంట్రోలింగ్ ఆఫీసరు డా.శ్రీదేవి మాట్లాడుతూ జిల్లా కలెక్టరు సలహలు, సూచనలతో పనిచేయడంతో ఈ అవార్డు దక్కిందన్నారు. 

Related Posts