సమాజంలో మార్పు తీసుకొస్తామని కొంతమంది చెబుతున్నారు. అది ఒకరోజులో అయ్యేది కాదు. గత 14 సంవత్సరాలుగా చంద్రబాబు ఎంతో మార్పు తీసుకొచ్చారని డిప్యూటీ సిఎం చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ కుడా పాల్గోన్నారు. అమలాపురం లో 1.65కోట్లతో నిర్మించిన చంద్రబాబు ఆరోగ్య ఉద్యానవనం, అమలాపురం సెంటర్లో స్మారక చిహ్నం గా 60 లక్షలతో ఆధునీకరించిన నూతన గడియారస్థంభం, అమలాపురం ఏరియా ఆసుపత్రిలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను మంత్రులు ప్రారంభించారు. త్వరలో అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని చినరాజప్ప వెల్లడించారు. ఆర్థిక మంత్రి యనమల మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తుంటే... కొంతమంది పదవుల కోసం ప్రాకులాడుతున్నారని ఆరోపించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు 9 లక్షల 50 వేల గృహాలు నిర్మిస్తున్నాం. ఇవి 2019 మార్చినాటికి ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని అన్నారు. అమలాపురంలో త్రాగునీటి ట్యాంకులు, పైపులైన్ నిర్మాణానికి 8.50 కోట్ల రూపాయలు, డ్రైన్ల నిర్మాణానికి 9.50 కోట్లు రూపాయలు మంజూరు చేసాం. వాటికి త్వరలో టెండర్లు పిలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి డిప్యూటి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, ఎంపీ రవీంద్ర బాబు, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ తదితరులు హజరయ్యారు.