YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దుబాయిలో మంత్రి లోకేష్ పర్యటన

దుబాయిలో మంత్రి లోకేష్ పర్యటన

రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనల్ని కట్టుబట్టలతో బయటకి గెంటేసారు. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తలసరి ఆదాయం తక్కువ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్ర ప్రయాణం మొదలు అయ్యిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. దుబాయి పర్యటనలో వున్న అయన మంగళవారం నాడు టీడీపీ ఎన్నారై భేటీలో పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ రాజధాని కూడా ఎక్కడో తెలియదు.అలాంటి పరిస్థితిలో అమరావతి మన రైతులు 35 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర విభజన చేసిన వారు అసూయపడే విధంగా రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుంది. దేశంలో ఏ రాష్ట్రం సాధించని విధంగా రెండంకెల వృద్ధి సాధించాం.11.22 శాతం వృద్ధి సాధించామని అన్నారు. నదుల అనుసంధానం గురించి దేశం అంతా మాట్లాడారు కానీ ఎవ్వరూ చెయ్యలేదు.ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే గోదావరి,కృష్ణా నదులను అనుసంధానం చేసారు. కరువు ను చూసి రైతులు భయపడే రోజులు పోవాలి.రైతు ను చూసి కరువు బయపడాలి అని ముఖ్యమంత్రి వ్యవసాయ రంగం అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశ వ్యాప్తంగా 5 లక్షల పంట కుంటలు తవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 10 లక్షల పంట కుంటలు తవ్వామని అన్నారు. రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేసాం.అందుకే రాష్ట్రానికి పెద్ద కంపెనీలు క్యూ కడుతున్నాయి.ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల కంపెనీల్లో ఒక్కటి అయిన కియా మన రాష్ట్రానికి వచ్చింది. గ్రామాల్లో ఎప్పుడూ లేని విధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. 14 వేల కిలోమీటర్ల సిసి రోడ్లు వేసాం.30 లక్షల ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసాం.అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఇంటికి కులాయి ద్వారా తాగునీరు అందిస్తాం.. ఆంధ్రప్రదేశ్ లో తక్కువ వర్షపాతం ఉన్నా వ్యవసాయ రంగంలో వృద్ధి సాధిస్తున్నాం.హార్టీ కల్చర్,ప్రకృతి వ్యవసాయం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఐటి రంగం మొత్తం హైదరాబాద్ లో ఉండిపోయింది . 2019 నాటికి లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం. విశాఖపట్నం కు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వచ్చింది. అమరావతి కి హెచ్ సిఎల్ వచ్చింది. తిరుపతి కి జోహో వచ్చింది. ఎలక్ట్రానిక్స్ రంగం వేగంగా అభివృద్ధి సాధిస్తున్నాం. ఫాక్స్ కాన్ లాంటి అనేక పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయి. దేశంలో తయారు అయ్యే 10 ఫోన్లలో 3 ఫోన్లు ఆంధ్రప్రదేశ్ లో తయారు అవుతున్నాయని మంత్రి అన్నారు. ఒక్క ఫాక్స్ కాన్ లోనే 14 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు. 67 ఏళ్ల వయస్సులో 24 ఏళ్ల కుర్రాడిలా ముఖ్యమంత్రి పని చేస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ అమరావతికి ఒక బ్రాండ్ తీసుకొచ్చారు. ఎన్ఆర్ఐ లు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లు గా మారి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి ని గురించి ప్రచారం చెయ్యాలని అన్నారు. ఎన్ఆర్ఐ లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ఏపీఎన్ఆర్టి ఏర్పాటు చేసాం. తెలుగు వారు ఎక్కడ ఏ సమస్య ఎదుర్కొన్నా, మీ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం సిద్ధంగా.మీ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసాం. బీజేపీ తెలుగు రాష్ట్రాలకు  అన్యాయం చేసింది. ఇచ్చిన ఒక్క హామీ కూడా బీజేపీ నిలబెట్టుకోలేదు. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి అని నిలదీస్తే బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ప్రత్యేక హోదా తో పాటు ఒక్క ఇచ్చిన 18 హామీలు నెరవేర్చలేదు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలను ఐక్యం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అన్ని పార్లమెంట్ సీట్లు గెలిస్తే దేశ ప్రధాని ఎవ్వరు అవ్వాలి అనేది చంద్రబాబు నిర్ణయించబోతున్నారు. హోదా తో ఇచ్చిన అన్ని హామీలు సాధిస్తాంమని అన్నారు. 

Related Posts