పోలీస్ శాఖలో కానిస్టేబుల్, వార్డర్స్, ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి ఏపీ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్షలు, దేహదారుఢ్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ మేరకు జనవరి 6న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి రెండో వారంలో దేహదారుఢ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది రాతపరీక్ష నిర్వహిస్తారు.
* కానిస్టేబుల్ పోస్టులు: 2,723
పోస్టులు పోస్టుల సంఖ్య
పోలీస్ కానిస్టేబుల్ (ఎస్‌సీటీ) - మెన్/ఉమెన్ 1600
పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్) (ఎస్‌సీటీ) - మెన్/ఉమెన్ 300
పోలీస్ కానిస్టేబుల్ (ఏపీఎస్పీ) (ఎస్‌సీటీ) - మెన్ 300
వార్డర్స్ – మెన్ / ఉమెన్ 123
ఫైర్‌మెన్ 400
మొత్తం పోస్టులు 2,723
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అయితే కానిస్టేబుల్, ఫైర్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఇంటర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి (01.07.2018 నాటికి):
* కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు 18 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1996 - 01.07.2000 మధ్య జన్మించినవారై ఉండాలి.
* హోంగార్డులుగా ఏడాది కాలంగా పనిచేస్తున్నవారు మాత్రం 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1988 - 01.07.2000 మధ్య జన్మించినవారై ఉండాలి.
* వార్డర్, ఫైర్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1988 - 01.07.2000 మధ్య జన్మించినవారై ఉండాలి.
* నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీలకు రూ.150.
ఎంపిక విధానం: రాతపరీక్షలు (ప్రిలిమినరీ, మెయిన్స్), దేహదారుఢ్య పరీక్షల ద్వారా.
పరీక్ష విధానం:
ప్రిలిమ్స్..
* మొత్తం 200 మార్కులకు ప్రిలిమ్స్ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రం ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
* ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి తుది పరీక్షలకు ఎంపికచేస్తారు.
* అర్హత మార్కులను ఓసీలకు 40% గా; బీసీలకు 35% గా; ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ లకు 30% గా నిర్ణయించారు.
మెయిన్స్..
* మెయిన్స్ రాతపరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. కానిస్టేబుల్ (ఏఆర్/ ఏపీఎస్పీ) పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. మిగతా పోస్టులకు 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు.
* అర్హత మార్కులను ఓసీలకు 40% గా; బీసీలకు 35% గా; ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్‌లకు 30% గా నిర్ణయించారు.
పరీక్ష సిలబస్..
ప్రిలిమ్స్ రాతపరీక్షలో కింది విభాగాల నుంచి మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. మెయిన్ పరీక్షలోనూ వీటి నుంచే ప్రశ్నలు వస్తాయి.
ఇంగ్లిష్
అరిథ్‌మెటిక్
రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ
జనరల్ సైన్స్
ఇండియన్ హిస్టరీ
ఇండియన్ కల్చర్
ఇండియన్ జియోగ్రఫీ
ఇండియన్ పాలిటీ & ఎకానమీ
భారత జాతీయ ఉద్యమం
జాతీయ, అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలు
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.11.2018
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.12.2018
* పరీక్ష తేది: 06.01.2019