అధికారం నుంచి దింపేందుకైనా.. పీఠం కట్టబెట్టేందుకైనా పెట్టింది పేరైన ఉల్లి ఈ సారి మధ్యప్రదేశ్‌లో తన ప్రభావం చూపేలా ఉంది. రాష్ట్రంలో గత పది రోజులుగా విపరీతంగా పెరుగుతున్న ఉల్లి ధర ఓ వైపు వినియోగదారులు, మరోవైపు భాజపా నేతల కళ్లలోనూ నీళ్లు తెప్పిస్తున్నాయి. భోపాల్ మండీలో మొన్నటి వరకు రూ.800 ఉన్న క్వింటా ఉల్లి... ఏకంగా రూ.1600కు ఎగబాకింది. సమీప భవిష్యత్తులోనూ ధర ఇంకా పెరిగే అవకాశముందని.. చౌహాన్ సర్కారుకు ఇది కూడా ఓ ప్రతికూలాంశం కానుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.