YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

తెలుగు సినిమాలోడెహ్రాడున్ బ్యూటీ సాషా చెట్రి.

తెలుగు సినిమాలోడెహ్రాడున్ బ్యూటీ సాషా చెట్రి.

- దర్శకుడు అడివి సాయి కిరణ్ త‌దుప‌రి చిత్రంలో సాషా చెట్రి

-   హైదరాబాద్‌లో ఎయిర్ టెల్ బ్యూటీ నటన శిక్షణ

ఎయిర్ టెల్ 4జి ప్రకటనలతో యావత్ భారతదేశంలో అభిమానులను సంపాదించుకుంది డెహ్రాడున్ బ్యూటీ సాషా చెట్రి. స్కూల్ రోజులనుంచే మోడలింగ్‌పై ఉన్న ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టింది సాషా. చిన్న వయసులోనే మోడలింగ్, వాణిజ్య ప్రకటనలలో సంద‌డి చేసి పేరు ప్రఖ్యాతుల‌ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. కేవలం మోడలింగ్‌కే ప‌రిమితం కాకుండా.. క్రియేటివిటీ, సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యం పొందింది. ఇదిలా ఉంటే.. సాషా త్వరలోనే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టనుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ‘వినాయకుడు’, ‘విలేజీలో వినాయకుడు’, ‘కేరింత’ చిత్రాల దర్శకుడు అడివి సాయి కిరణ్  రూపొందించనున్న త‌దుప‌రి సినిమాలో ఈ డెహ్రాడున్ భామ నటించనుంద‌ని స‌మాచారం. ఈ నేపథ్యంలోనే..  హైదరాబాద్‌లో నటనకి సంబంధించిన‌ శిక్షణ కూడా తీసుకుందట సాషా. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డికానున్నాయి.

Related Posts