YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

‘ప్రామిస్’ అంటున్న వర్మ

 ‘ప్రామిస్’ అంటున్న వర్మ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా చేసినా.. ట్వీట్లు పెట్టినా ఏదైనా  సంచలనమే. వివాదాస్పదమైన అంశాన్ని తెరకెక్కించడం.. సోషల్ మీడియాలో వరుస ట్వీట్లతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు వర్మ. ఆదివారం ‘ప్రామిస్ డే’ సందర్భంగా వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ.. సరికొత్త ట్వీట్లతో అలరించాడు. ‘హ్యాపీ ప్రామిస్ డే.. ఈ రోజు నేను ప్రామిస్ నిలబెట్టుకోనని.. మీకు ప్రామిస్ చేస్తున్నా. దేవుడిపైనా.. నా తల్లిపైనా ప్రామిస్ చేయను కానీ.. అందుకు బదులుగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, స్టీవెన్ స్పీల్ బర్గ్, అయాన్ ర్యాండ్, దావూద్ ఇబ్రహీం, బ్రూస్ లీ, మియా మల్కోమాలపై నేను ప్రామిస్ చేస్తాను. ఈ ఏడాది ఓ బాధ్యత గల చాలా మంచి వ్యక్తిలా ఉండేందుకు ప్రయత్నిస్తా. హ్యాపీ ప్రామిస్ డే’ అంటూ ట్వీట్ పెట్టాడు. కాగా, జీఎస్టీ (గాడ్,  సెక్స్ అండ్ ట్రూత్) చిత్రం అనంతరం అక్కినేని నాగార్జున‌తో సినిమా చేస్తున్న వర్మ.. ప్రస్తుతం ముంబైలో షూటింగ్‌ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడు. 

Related Posts